• search
  • Live TV
ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అప్పుల తిప్పలు.. 5 రోజులుగా జాడ లేని వ్యాపారి.. చనిపోతున్నానంటూ వీడియో..!

|

ఖమ్మం : అప్పులు ఆ వ్యాపారికి కంటిమీద కునుకులేకుండా చేశాయి. చేసిన అప్పులు తీర్చే మార్గం కనపడక అదృశ్యమయ్యాడు. అంతేకాదు తాను సూసైడ్ చేసుకోబోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి సన్నిహితులకు పంపించాడు. ఖమ్మం టౌన్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 కోట్ల రూపాయలకు లెక్క చెప్పి మరీ అదృశ్యం కావడం చర్చానీయాంశమైంది.

ఐదు రోజుల కిందట అదృశ్యమైన సదరు వ్యాపారి జాడ ఇంతవరకు దొరకలేదు. అప్పుల బాధతో చనిపోతానంటూ సెల్ఫీ వీడియో తీయడం ఆయన కుటుంబ సభ్యుల్లో కలవరం రేపింది. ఇంతకు ఆయన ఎక్కడున్నారనేది సస్పెన్స్‌గా మారడంతో పోలీసులకు సవాల్‌గా మారింది.

ఐదు రోజులుగా అదృశ్యం.. పోలీసులకు భార్య ఫిర్యాదు

ఐదు రోజులుగా అదృశ్యం.. పోలీసులకు భార్య ఫిర్యాదు

ఖమ్మంకు చెందిన వ్యాపారి రాయపాటి నరసింహారావు ఐదు రోజులుగా కనిపించడం లేదు. దాంతో అతడి భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అదలావుంటే తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి సన్నిహితులకు పంపించడం కలకలం రేపింది. అద‌ృశ్యమయ్యారని భావిస్తున్న తరుణంలో ఆయన ఆ వీడియో పంపించడం ఆందోళనకు గురిచేసింది.

అప్పుల బాధ తాళలేక సూసైడ్ చేసుకోబోతున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. తాను ఎవరెవరికి ఎంత అప్పు ఉన్నారో మొత్తం లెక్కలు రాసి మరీ చనిపోతానంటూ వీడియో రికార్డు చేశారు. ఆ లెక్కల పద్దులను సైతం మిత్రులకు వాట్సాప్‌లో షేర్ చేశారు. నరసింహారావుకు దాదాపు 8 కోట్ల మేర అప్పులున్నట్లు సమాచారం. మొదట్లో కొద్దిగా ఉన్న అప్పులు క్రమక్రమంగా పెరగడం.. వాటిని తీర్చే మార్గం కనపడకపోవడంతోనే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.

మూడేండ్ల కిందట లంచం.. ఇంతవరకు పనిగాలే.. వీఆర్‌వోపై తిరగబడ్డ రైతులు..! (వీడియో)మూడేండ్ల కిందట లంచం.. ఇంతవరకు పనిగాలే.. వీఆర్‌వోపై తిరగబడ్డ రైతులు..! (వీడియో)

సూసైడ్ చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో.. ఖమ్మంలో కలకలం

సూసైడ్ చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో.. ఖమ్మంలో కలకలం


నరసింహారావు తీసిన సెల్ఫీ వీడియోలో అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందరూ నన్ను ఇలా మోసం చేస్తారని ఏనాడు ఊహించలేదని చెప్పుకొచ్చారు. తాను అప్పు తెచ్చుకున్న చోట డబుల్ వడ్డీలు కట్టానని వెల్లడించారు. కొందరి పేర్లు చెప్పి వారికి క్రమంగా వడ్డీలు చెల్లిస్తున్నానని తెలిపారు. అయితే ఒక ఇద్దరి పేర్లు చెప్పి.. వారు మాత్రం తనను ఏనాడు ఇబ్బందులు పెట్టలేదని పేర్కొన్నారు. వాళ్లు దేవుళ్లని.. తనను నమ్మి డబ్బులు ఇచ్చారని తెలిపారు.

అదలావుంటే పదేపదే ఓ వ్యక్తి పేరు ప్రత్యేకంగా చెప్పి ఆయన దగ్గర తీసుకున్న డబ్బులకు న్యాయం చేయలేకపోతున్నానని వాపోయారు. తనకొచ్చే డబ్బులు ఎవరైనా తిరిగి ఇస్తే మాత్రం ఆయనకు తప్పకుండా ఇవ్వగలవు అంటూ భార్యకు సూచించాడు. ఆయనకు తప్ప ఏ ఒక్కరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ పేర్కొన్నాడు. సదరు వ్యక్తి తనను క్షమించాలని కోరారు. ఊరికే టెన్షన్ పడొద్దని.. ఏదో ఒకటి చేసి అప్పుల నుంచి బయటపడాలని అతడు రోజు చెబుతూనే ఉన్నారని.. తన మంచి కోరిన అలాంటి వ్యక్తికి అన్యాయం చేసి వెళ్లిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అప్పుల బాధ భరించడం తన వల్ల కావడం లేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు.

ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియక..!

ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియక..!

వ్యాపారి నరసింహారావు ఐదు రోజులుగా కనిపించకుండా పోవడం ఖమ్మంలో కలకలం రేపింది. అప్పుల బాధతో ఆయనే అదృశ్యమయ్యారా లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమైనట్లు తెలుస్తోంది. కానీ, సడెన్‌గా నరసింహారావు తాను చనిపోబోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి సన్నిహితులకు పంపించడం చర్చానీయాంశమైంది. అదలావుంటే ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియక కుటుంబ సభ్యులు మాత్రం మనోవేదనకు గురవుతున్నారు. తెచ్చుకున్న అప్పులకు వడ్డీల మీద వడ్డీలు కట్టడమే ఆయనకు ఈ పరిస్థితి తెచ్చిందా అనే వాదనలు లేకపోలేదు.

English summary
Khammam Businessman Rayapati Narasimharao disappear since five days. His wife complaint to police, but not traced out. Meanwhile narasimharao released some selfie video about suicide attempt while he have crores of rupees debts. That video goes viral and create sensation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X