ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో పంజా విసిరిన మావోయిస్టులు... కిడ్నాప్ అయిన టీఆర్ఎస్ నేత హత్య

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మావోయిస్టులు తోలిసారిగా తమ ఉనికిని చాటుకున్నారు. నాలుగు రోజుల క్రితం
భద్రాద్రి- కొత్త గూడేం జిల్లా కొత్తూరు జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత,మాజీ ఎంపీటీసీ అయిన ఎన్ శ్రీనివాసరావు కిడ్నాప్ చేసిన మావోయిస్టులు నేడు హత్య చేశారు...శ్రీనివాసరావు పోలీసుల ఇన్మార్మర్‌గా వ్యవహరిస్తున్నారంటూ.... జిల్లాలోని ఎర్రంపాడు -పోట్టిపాడు గ్రామాల మధ్య శవాన్ని వదిలిపెట్టారు. కాగా సంఘటన స్థలంలో చర్ల-శబరి ఏరియా డివిజన్, శారద అనే పేరుమీద ఓ లేఖను కూడ విడుదల చేశారు.

గత సోమవారం కిడ్నాప్ చేసిన మావోలు

గత సోమవారం కిడ్నాప్ చేసిన మావోలు

కాగా సోమవారం అర్థరాత్రీ ఇంట్లో ఉన్న నల్లూరి శ్రీనివాస రావును 15 మంది వరకు ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు, తుపాకులు, కర్రలతో వచ్చి తీసుకెళ్లినట్టు శ్రీనివాస రావు భార్య దుర్గా మీడియాతో తెలిపింది. అయితే తన భర్తను తీసుకువెళ్లందని వేడుకున్న వినకుండా తనతోపాటు తన కుమారున్ని కొట్టిన వారు తన భర్తను సైతం కొట్టుకుంటూ బయటకు తీసుకు వచ్చారని చెప్పింది.
మావోయిస్టులను అడ్డుకునేందుకు ప్రయత్నాల చేసినప్పటికి తనపై తుపాకి ఎక్కుపెట్టారని, దీంతో ఇంటి నుండి బయటకు రాకుండా చేశారని తెలిపింది.

నాలుగు రోజులుగా కుటుంభ సభ్యుల ప్రయత్నం

నాలుగు రోజులుగా కుటుంభ సభ్యుల ప్రయత్నం

కాగా నాలుగు రోజుల నుండి సుమారు 200 మంది వరకు గ్రామ ప్రజలతో పాటు శ్రీనివాస రావు కుటుంభ సభ్యులు ఆయన్ను వెతుక్కుంటూ చత్తీస్‌గఢ్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో తన భర్తకు ఎలాంటీ హాని కల్గించకుండా వదిలిపెట్టాలని ఆమే కోరింది. దీంతో మావోయిస్టులు తీసుకెళ్లిన టీఆర్ఎస్ నేతను తిరిగి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. అటు కుటుంభ సభ్యులు, ఇటు పోలీసులు చేసిన విన్నపాలను మావోయిస్టులు వినిపించుకోకుండా చంపివేశారు.

శ్రీనివాసరావు హత్యతో ఖమ్మంలో టెన్షన్

శ్రీనివాసరావు హత్యతో ఖమ్మంలో టెన్షన్

జిల్లాలో దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతవరణ నెలకొంది. ఈనేపథ్యంలోనే చాల రోజుల తర్వాత మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో ప్రజా ప్రతినిధులు సమాచారం లేకుండా ఏజన్సీ ప్రాంతాల్లో సంచరించవద్దని సూచించారు. మరోవైపు ఖమ్మంలో పోలీసులు మోహరించారు.

English summary
maoists killed who Telangana Rashtra Samithi (TRS) leader has been "taken away" by Maoists from his house in Bhadradri-Kothagudem district to the neighbouring Chhattisgarh,on monday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X