ఓరీ.. శ్రీనాథ్.. ఏందిరా ఇదీ, యువతిని మోసం చేసి.. మరో పెళ్లా..?
అమ్మాయికి పేరంట్స్ లేరు.. ఉన్న అన్న కూడా దూరంగా ఉంటున్నాడు. ఇంకేముంది.. ఆమె వీక్ నెస్ క్యాచ్ చేశాడు. వలపువల విసిరాడు. రెండేళ్లు తిరిగాడు. ప్రేమ ముగ్గులోకి దింపాడు. పెళ్లి పేరుతో సహజీవనం కూడా చేశాడు. కట్ చేస్తే.. మరో పెళ్లికి సిద్దమయ్యాడు. ఇదీ ఓ నీచ శ్రీనాథుడు చేసిన మోసం. ఆ యువతి పెళ్లి ఆపేందుకు వెళ్లిన లాభం లేకపోయింది. చివరికీ ఆమెపైనే దాడి చేయించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.

మరో పెళ్లికి సిద్దం..
మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న వరుడిని నిలదీసేందుకు ఆమె వెళ్లింది. కానీ ఆమెకు అక్కడ చుక్కెదురు అయ్యింది. ఆమె ఆశించింది జరగలే.. కదా జుట్టు పట్టీ యువతిపై సాటి మహిళలు దాడి చేశారు. కళ్యాణమండపం బయట పోలీసు కానిస్టేబుల్ కళ్లముందే జరిగింది. ఇంతా జరుగుతున్న అతను స్పందించలేదు. మండపం గేట్ వద్ద ఉన్న కానిస్టేబుల్.. యువతిపై మహిళలు దాడి చేస్తున్నా.. ఆపాలని ప్రయత్నించలేదు.

ప్రేమించినప్పుడు ఓకే.. పెళ్లి అనేసరికి
ప్రేమించిన సమయంలో శ్రీనాథ్ బాగానే ఉన్నాడు. పెళ్లి అని అడిగేసరికి అమ్మమ్మ.. నాన్నమ్మ పేరు తీసుకొచ్చాడు. అమ్మను ఒప్పించాలని సొల్లు కబుర్లు చెప్పాడు. వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. మరో అమ్మాయితో పెళ్లి పీటలెక్కాడు. బాధితురాలు వస్తుందని ముందే ఊహించి.. తన బంధువులు ఆడవారితో యువతిపై దాడి చేయించాడు.

మోసపోయిన యువతి
కపట ప్రేమనే అమరప్రేమగా భావించిన యువతి మోసపోయింది. పెళ్లి నిశ్చయం అయిందని తెలియగానే కోర్టు నుంచి నోటీసులు పంపింది. అతను స్పందించలేదు. దీంతో నోటీసులు తీసుకుని అబ్బాయి ఇంటికి వెళ్ళానని చెప్పింది. పెళ్లి నిశ్చయం చేసుకున్న యువతి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి విషయం చెప్పినా వారు పట్టించుకోలేదట. తర్వాత స్థానిక పోలీసులకూ ఫిర్యాదు చేసింది. పెళ్లి మండపానికి ఒంటిరిగా వెళితే దాడి చేస్తారని..పోలీసుల సాయంతో వెళ్లింది. కానీ అబ్బాయి తరపు బంధువులు కొడుతుంటే పోలీసులు చోద్యం చూశారు. పోలీసులను అబ్బాయి తరఫు వారు డబ్బులతో మేనేజ్ చేశారని ఆరోపించింది.