లిప్ట్ బటన్‌తో వైరస్, 20 మందికి పాజిటివ్, ఖమ్మంలో ఘటన
కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో తెలియడం లేదు. కానీ కుగ్రామాలకు కూడా పాకింది. అయితే ఖమ్మం పట్టణంలో విచిత్రంగా వైరస్ ప్రబలింది. అలా 20 మందికి వరకు కరోనా వచ్చింది. వైరస్ వ్యాప్తి గురించి తెలిసిన వారు.. ఆశ్చర్యపోయారు. ఇక అపార్ట్ మెంట్లో ఉన్న మిగతావారు కూడా ఆందోళన చెందారు. మరోవైపు వైరస్ సోకిన వారు నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ఖమ్మం బైపాస్ రోడ్డులో ఓ అపార్ట్ మెంట్ ఉంది. ఐదు అంతస్తులు ఉండగా.. ఇందులో ఫ్యామిలీస్ ఉంటున్నాయి. అయితే రెండు వారాల్లో 20 మందికి వైరస్ వచ్చింది. కానీ వైరస్ ఎలా వచ్చిందో తెలియలేదు. గ్రౌండ్ ప్లోర్లో గల ఒకరికీ కూడా వైరస్ రాలేదు. పై అంతస్తు వారికి సోకినట్టు తెలుస్తోంది. ఒకరికీ సోకడం..వారు లిప్ట్ వాడటంతో అంటుకున్నట్టు తెలుస్తోంది.
వైరస్ వ్యాపించం కన్నా ముందే వాచ్ మెన్ కుటుంబం వెళ్లిపోయింది. కానీ అపార్ట్ మెంట్ ఫ్యామిలీలో ఎవరికీ వైరస్ వచ్చిందో నిర్ధారణ కాలేదు. కానీ ఒకరి నుంచి పలువురికి వ్యాపించింది. అయితే తొలుత లిప్ట్ వాడటంతో వైరస్ స్ప్రెడ్ అయినట్టు తెలుస్తోంది. మిగతా వారు కూడా లిప్ట్ యూజ్ చేయడంతో వారికి అంటుకుంది. అలా పదుల సంఖ్యలో వైరస్ అంటుకుంది. అయితే వైరస్ నిర్ధారణ అయిన కుటుంబాలు మాత్రం నిత్యావసర సరుకుల కోసం తల్లడిల్లాయి.
దీంతో వాచ్‌మన్ కుటుంబం వెళ్లిపోయింది. పాజిటివ్ వచ్చినవారు క్వారంటైన్ కావడం, అపార్ట్మెంట్లోని మిగతావారు బయటకు వచ్చేందుకు జంకడంతో నిత్యావసర సరుకులు తెచ్చేవారు కరువై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.