ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైరా మహిళకు కుడివైపున గుండె

|
Google Oneindia TeluguNews

మానవ శరీరంలో గుండె ఎడమ వైపు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కానీ ఈ మహిళకు మాత్రం గుండె కుడి వైపు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. 22 ఏళ్లుగా తన గుండె కుడి వైపు ఉందన్న విషయం ఆమె కూడా తెల్సుకోలేకపోయింది. వేరే కారణంతో ఆస్పత్రికి వెళ్లగా అనూహ్యంగా గుండె గుట్టు బయటపడింది. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ప్రముఖ డాక్టర్ దారెల్లి కోటయ్య చెప్పిన వివరాలివి..

వైరా మున్సిపాలిటీలోని 3వ వార్డుకు చెందిన బాసాటి ఉష(22)కు అదే ప్రాంతానికి చెందిన ఆనంద్ తో చాలాకాలం కిందటే పెళ్లయింది. ఇప్పటిదాకా సంతానం లేకపోవడంతో టెస్టుల కోసం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. టెస్టుల్లో భాగంగా గుండెను కూడా డాక్టర్ పరిశీలించగా.. ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపు ఉన్నట్లు అనుమానం రావడంతో స్కానింగ్‌ తీయించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

 woman having heart in right side in wyra of khammam district

Recommended Video

Coronavirus Upadate : 2nd డెత్ In India, 68-Year-Old Woman Passed Away In Delhi

కాగా, లక్షల్లో ఒకరికి ఈ విధంగా గుండె కుడివైపు ఉంటుందని, దీని వల్ల ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు ఉండవని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ కోటయ్య చెప్పారు. గతేడాది అక్టోబర్ లో ఉత్తరప్రదేశ్ లోని ఖుషీనగర్ కు చెందిన ఓ వ్యక్తికి.. గుండె కుడి వైపు, కాలేయం ఎడమ వైపు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.

English summary
a married women usha(22) has heart on right side. doctors found this when she came to fertility tests. incident came light in wyra of khammam district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X