బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది?: వైఎస్ షర్మిల
విభజన హామీ అయిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని బీజేపీ, టీఆర్ఎస్ గాలికొదిలేశాయని షర్మిల విమర్శించారు. కేసీఆర్, బీజేపీతో డ్యూయెట్లు పాడి, విభజన హామీని మర్చిపోయారని మండిపడ్డారు. ఉక్కు ఫ్యాక్టరీ వస్తే వేలు సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. ఎన్నికల ముందు పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. వైయస్ హయాంలో రాష్ట్రంలో 3.34లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారని.. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే లక్షా 20వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారని గుర్తుచేశారు. ప్రజాప్రస్థానంలో భాగంగా YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు 52వ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం గార్ల మండలం పెద్దకిష్ణాపురంలో పాదయాత్ర ప్రారంభించారు.

కుర్చీ వేసుకొని మరీ..
అధికారులతో
వచ్చి,
కుర్చీ
వేసుకుని
మరీ
పోడు
పట్టాలు
ఇస్తానన్న
కేసీఆర్..
ఓట్లు
వేయించుకున్నాక
ఇటువైపు
చూడలేదన్నారు.
రేవు
దాటే
వరకే
ఓడ
మల్లన్న..
రేవు
దాటాక
బోడ
మల్లన్న
అన్నట్లు
కేసీఆర్
వ్యవహరించారని
మండిపడ్డారు.
జిల్లాకు
చెందిన
పంచాయతీ
కార్యదర్శి
ఈసం
వెంకటేశ్
కేసీఆర్
నిర్వాకం
వల్ల
ఆత్మహత్య
చేసుకున్నారని
మండిపడ్డారు.
ప్రభుత్వం
నిధులు
మంజూరు
చేయకపోవడంతో
సొంత
నిధులు
ఖర్చు
చేసి
అప్పులపాలై
ఆత్మహత్య
చేసుకున్నాడని
తెలిపారు.
తన
సూసైడ్
లెటర్లో
ఇది
ఉద్యోగమా?
బానిసత్వమా?
అంటూ
ఆవేదన
వ్యక్తం
చేశారని
గుర్తుచేశారు.

నిరుద్యోగుల ఆత్మహత్య
ఇదే
జిల్లాకు
చెందిన
నిరుద్యోగి
ముత్యాల
సాగర్..
నోటిఫికేషన్లు
రాక
ఎదురుగా
వచ్చే
రైలు
కింద
పడి
ఆత్మహత్య
చేసుకున్నాడు.
ఇద్దరి
ఆత్మహత్యలకు
కేసీఆరే
కారణం.
అయినా
ఏనాడు
పరామర్శించలేదు.
ఒక్క
రూపాయి
కూడా
సాయం
చేయలేదని
మండిపడ్డారు.
రెండుసార్లు
అధికారంలోకి
వచ్చిన
కేసీఆర్..
ప్రజలను
మోసగించారని
పేర్కొన్నారు.
ఎన్నికల
ముందు
రుణమాఫీ
అని
రైతులను
మోసం
చేశారని
వివరించారు.
కేజీ
టు
పీజీ
ఉచిత
విద్య
అని
విద్యార్థులను
మోసం
చేశారని
తెలిపారు.
మూడెకరాల
భూమి
ఇస్తానని
దళితుల్ని
మోసం
చేశారని
ఫైరయ్యారు.

రాజకీయాలే తప్ప
కేసీఆర్
కు
ఎంత
సేపు
రాజకీయాలే
తప్పా
ప్రజల
గురించి
ఆలోచన
చేయరని
మండిపడ్డారు.
వాళ్ల
కుటుంబానికి
తప్పతే
ఎవరికీ
మేలు
చేయలేదు.
డిగ్రీ,
పీజీ
చదివిన
యువతకు
ఉద్యోగాలు
లేక
హమాలీ
పనికి
పోతున్నారు.
ఆటోలు
నడుపుకొంటున్నారు.
రూ.10వేలకు
చిన్నచిన్న
ఉద్యోగాలు
చేసుకుంటున్నారు.
బంగారు
తెలంగాణ
అని
చెప్పి
అప్పుల
తెలంగాణ,
ఆత్మహత్యల
తెలంగాణగా
మార్చాడు.
బంగారు
తెలంగాణ
అని
చెప్పి
బాధల
తెలంగాణ,
పేదలకు
బతుకే
లేని
తెలంగాణగా
మార్చాడు.
బంగారు
తెలంగాణ
అని
చెప్పి
బీర్లు,
బార్ల
తెలంగాణగా
మార్చాడని
షర్మిల
విమర్శించారు.