వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: ఆ క్యాచ్ కిక్కే వేరప్పా..దినేష్ కార్తీక్ పట్టిన క్యాచ్ మ్యాచ్‌ టర్న్ చేసిందా..?

|
Google Oneindia TeluguNews

దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అదరగొట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన కీలకపోరులో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కేకేఆర్ 60 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో రాజస్థాన్‌ను ఇంటిబాట పట్టించి.. తన ప్లేఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ పట్టిన ఓ క్యాచ్ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. అసలు మ్యాచ్ మొత్తం ఈ సూపర్ క్యాచ్‌తో టర్న్ అయింది.

అసలు సంగతేంటంటే.. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో ప్యాట్ కమిన్స్ వేసిన మూడో ఓవర్ తొలి బంతిని బెన్ స్టోక్స్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్లిప్ వైపు దూసుకెళ్లింది. అయితే అంతే వేగంగా సూపర్ డైవ్ చేసిన డీకే.. ఒంటి చేత్తో బంతిని అద్భుతంగా అందుకున్నాడు. ఫస్ట్ స్లిప్ క్యాచ్‌ను డీకే పక్షిలా గాల్లోకి ఎగిరి అందుకోవడంతో అంతా స్టన్ అయ్యారు. కామెంటేటర్లు అయితే నమ్మశక్యం కానీ క్యాచ్.. వాటే కీపింగ్ డీకే అంటూ కొనియాడారు. ఈ సూపర్ క్యాచ్‌కు అవాక్కైన స్టోక్స్ (18) నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ వికెట్‌తో రాజస్థాన్ రాయల్స్ పతనం మొదలైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

KKR vs RR:Watch Dinesh Karthik stunning catches

వాస్తవానికి గత రెండు మ్యాచ్‌ల్లోనూ 196 (ముంబైపై), 186 (పంజాబ్‌పై) పరుగుల లక్ష్యాన్ని కొన్ని బంతులు మిగిలి ఉండగానే అలవోకగా ఛేదించేసిన రాజస్థాన్ రాయల్స్.. కోల్‌కతా‌పై కూడా చెలరేగిపోతుందని అంతా ఊహించారు. కానీ.. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టుని ఛేదనలో ముందుండి నడిపించిన బెన్‌స్టోక్స్‌ సూపర్ క్యాచ్‌కు వెనుదిరగడంతో రాజస్థాన్ ఒత్తిడికి గురై వరుసగా వికెట్లు చేజార్చుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఇయాన్ మోర్గాన్(35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 68), రాహుల్ త్రిపాఠి(39) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా మూడు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆర్చర్, శ్రేయస్ గోపాల్ చెరొక వికెట్ తీశారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 131పరుగులే చేసి ఓటమిపాలైంది. జోస్ బట్లర్(35), రాహుల్ తెవాటియా(31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ (4/34) నాలుగు వికెట్లు తీయగా.. శివం మావి, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీశారు. నాగర్ కోటికి ఒక వికెట్ దక్కింది.

English summary
IPL 2020, KKR vs RR: Watch Dinesh Karthik Flies Like A Bird To Pull Off One-Handed Stunner catch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X