హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IPL 2020: కోవిడ్ హీరోల పేర్లతో జెర్సీ ధరించిన కోహ్లీ, ఏబీ..ఇంతకీ వారెవరు..?

|
Google Oneindia TeluguNews

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తొలి మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ గేమ్‌లో ఏబీ డెవీలియర్స్, విరాట్ కోహ్లీ, హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌‌ లాంటి టాప్ ప్లేయర్స్ ఉన్నారు. వీరు కాకుండా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ నుంచి కూడా టాలెంటెడ్ ఆటగాళ్లు సోమవారం జరిగే ఆటలో కనువిందు చేయనున్నారు. ఇక ఈ హై ఎలక్ట్రిఫైయింగ్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెడుతున్నారు స్టార్ ప్లేయర్స్. కోవిడ్ కారణంగా వీరంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.

ఇక ఈ ఏడాది ఐపీఎల్‌ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా జరుగుతోంది. స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే వారు ఉన్నారన్న ఫీలింగ్ టీవీల ముందు కూర్చున్న వీక్షకులకు కలిగిస్తున్నారు నిర్వాహకులు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంటోంది. కోవిడ్ పోరులో ముందు వరసలో ఉండి సేవ చేసిన కరోనావారియర్ల గౌరవార్థం కోహ్లీ మరియు డెవిలియర్స్ వారి పేర్లకు బదులు కరోనా హీరోల పేర్లు కలిగి ఉన్న జర్సీలను ధరిస్తున్నారు.ఏబీ డెవిలియర్స్ పరితోష్ పేరుతో ఉన్న జెర్సీ ధరించనుండగా.. కోహ్లీ సిమ్రాన్‌జీత్ పేరుతో ఉన్న జెర్సీని ధరిస్తున్నాడు.లాక్‌ డౌన్ సమయంలో వీరు సామాన్య ప్రజలకు చేసిన సేవకు గాను కృతజ్ఞత తెలుపుతూ వారిపేర్లున్న జెర్సీలను ధరిస్తున్నారు.

Recommended Video

IPL 2020: SRH vs RCB Match Preview, Pitch Report | Warner VS Kohli | Oneindia Telugu
Kohli and Ab De villiers honour Covid heroes by wearing the jersey with former names

ఇటు కోహ్లీ అటు ఏబీ డెవీలియర్స్ కూడా తమ ట్విటర్ హ్యాండిల్స్‌ను మార్చేశారు. ఈ కోవిడ్ వారియర్ పేర్లతో వారి ట్విటర్ హ్యాండిల్స్‌ను మార్చేశారు. లాక్‌డౌన సమయంలో ఆకలితో ఉన్న వారి కడుపు నింపిన పరితోష్‌కు తాను సెల్యూట్ చేస్తున్నట్లు ఏబీ డెవీలియర్స్ తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. అందుకే తనను గౌరవించాలని భావించి తన పేరుతో ఉన్న జెర్సీని ఈ సీజన్ మొత్తం ధరిస్తానంటూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే సిమ్రాన్ జీత్‌ పేద ప్రజలకు సహాయం చేసేందుకు విరాళాలు సేకరించాడు. రూ.98వేలు విరాళాలు సేకరించాడు. చెవిటి వాడైనా సిమ్రాన్ జీత్ పేద ప్రజలకు సహాయం చేయాలని సంకల్పించాడు. కోవిడ్ హీరోలను ఈ సమయంలో ఇలా గౌరవించడాన్ని మాజీ క్రికెటర్ మొహ్మద్ కైఫ్ అభినందించాడు. క్రీడలు మానవత్వాన్ని కూడా పంచుతున్నాయని ఇందుకు చాలా సంతోషంగా ఉందని కైఫ్ ట్వీట్ చేశాడు.

English summary
The IPL is also being played behind the closed doors and the frontline heroes were given a special tribute on the opening day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X