కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్‌కు బాబు వార్నింగ్‌:బోరున ఏడ్చిన మ‌హిళ‌లు.ఎలా ఓడార‌య్యా:వాళ్లు ఆప‌క‌పోతే అక్క‌డే తిష్ఠ వేస్తా.

|
Google Oneindia TeluguNews

Recommended Video

కుప్పంలో రెండో రోజు ప‌ర్య‌టించిన చంద్రబాబు || Chandrababu Second Day Tour In Kuppam Constituency

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎన్నిక‌ల ఫ‌లితాల పైన కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ప్ర‌జ‌ల‌కు అన్నీ చేసినా.. ఈ తీర్పు ఎలా ఇచ్చారో అని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. కుప్పంలో రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అక్క‌డి మ‌హిళ‌లు చంద్ర‌బాబు వ‌ద్ద క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌టం ఏంటంటూ రోదించారు. చంద్ర‌బాబు వారికి ధైర్యం చెప్పారు. తాను 14 సంవ‌త్స‌రాలు ముఖ్య‌మంత్రిగా..ప‌దేళ్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా ప‌ని చేసాన‌ని గుర్తు చేసారు. అయితే, కార్య‌క‌ర్త‌ల మీద దాడులు చేస్తే అక్క‌డికే వెళ్లి తాను తిష్ట వేస్తాన‌ని హెచ్చ‌రించారు.

వేషం మారింది..! దేశం మారేలోపు పట్టేసుకున్నారు..! ఎంత పనయ్యింది శివాజీ..!! <br>వేషం మారింది..! దేశం మారేలోపు పట్టేసుకున్నారు..! ఎంత పనయ్యింది శివాజీ..!!

చంద్ర‌బాబు వ‌ద్ద మ‌హిళ‌ల ఆవేద‌న‌...

చంద్ర‌బాబు వ‌ద్ద మ‌హిళ‌ల ఆవేద‌న‌...

ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌టం పైన మ‌హిళ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కుప్పంలో చంద్ర‌బాబు రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా స్థానికుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఆ స‌మ‌యంలో ప‌లువురు మ‌హిళ‌లు చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వ‌చ్చి క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. మీరు ఓడిపోవ‌టం ఏంటంటూ రోదించారు. అదే స‌మ‌యంలో ప‌లువురు మ‌హిళ‌లు చంద్ర‌బాబు కు పాదాభివందం చేసారు. వారికి చంద్ర‌బాబు ధైర్యం చెప్పారు. అంద‌రి బాగోగులు తాను చూసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. 35 ఏళ్లుగా కుప్పంలో త‌న‌కు ల‌భిస్తున్న ఆద‌ర‌ణ మ‌ర్చిపోలేన‌ని వివ‌రించారు. కుప్పం అభివృద్ది కోసం ..అదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర పురోగ‌తి కోసం తాను చేసిన కృషిని వివ‌రించారు. అనంత‌పురంలో క‌రువు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి కొరియా వెళ్లి కియో ఫ్యాక్టరీ తీసుకొచ్చాన‌ని వివ‌రించారు. ఇన్ని ప‌నులు చేస్తే ప్ర‌జ‌లు ఎలా తీర్పు ఇచ్చారో అర్దం కాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

అప‌క‌పోతే అక్క‌డే తిష్ట వేస్తా..

అప‌క‌పోతే అక్క‌డే తిష్ట వేస్తా..

నెల రోజుల కొత్త ప్ర‌భుత్వ పాల‌న పైనా చంద్ర‌బాబు స్పందించారు. తాము ఆరు నెల‌ల స‌మ‌యం ఇవ్వాల‌ని తొలుత భావించామ‌ని..అయితే కార్య‌క‌ర్త‌ల మీద దాడులు చేస్తుంటే చూస్తూ కూర్చోలేమ‌ని తేల్చి చెప్పారు. తాను ఎల్లుండి నుండి అధికార పార్టీ నేత‌ల దాడుల్లో మ‌ర‌ణించిన కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శ‌కు వెళ్తున్నాన‌ని వెల్ల‌డించారు. వారి కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి వారికి అయిదు ల‌క్ష‌ల చొప్పున ఆర్దిక సాయం అందిస్తామ‌న్నారు. అనంత‌పురం.. గుంటూరు..క‌ర్నూలు జిల్లాల్లో ఆరుగురు కార్య‌క‌ర్త‌లు మ‌ర‌ణించార‌ని..వారి ఇళ్ల‌కు వెళ్తాన‌ని చెప్పుకొచ్చారు. తామెన్న‌డూ రాజ‌కీయంగా కక్ష్య సాధింపు చ‌ర్య‌లకు దిగ‌లేద‌ని..ఇప్పుడు కుప్పంలో జెండాలు క‌ట్టే ప‌రిస్థితి కూడా లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఇక‌నైనా దాడులు ఆపేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసారు. ఇక ఎక్క‌డైనా దాడులు జ‌రిగితే అక్క‌డికే వెళ్లి కార్య‌కర్త‌ల‌కు మ‌ద్ద‌తుగా తిష్ట వేస్తాన‌ని చంద్ర‌బాబు నేరుగా ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు.

ఇంత చేసినా ప్ర‌జ‌లు మాత్రం ఇలా..

ఇంత చేసినా ప్ర‌జ‌లు మాత్రం ఇలా..

కుప్పంలో ఏర్పాటు చేసిన స‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌సంగించారు. టీడీపీ అధికారంలో ఉందీ..ప్ర‌తిప‌క్షంలో ఉందని వివ‌రించారు. ఎక్క‌డ ఉన్న టీడీపీది ఎప్పుడూ ప్ర‌జా ప‌క్ష‌మేన‌ని తేల్చి చెప్పారు. ప్ర‌తీ గ్రామానికి ఏదో ఒక‌టి చేసామ‌ని.. ప్ర‌తీ ఇంటికి ల‌బ్ది క‌లిగేలా వ్య‌వ‌హ‌రించామ‌ని..గుడ్ గ‌వ‌ర్నెన్స్ అందించామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. ఏ గ్రామం లో చూసిన సిమెంట్ రోడ్లు..క‌రెంట్‌.. ఉపాధి హామీ ప‌నులు అదే విధంగా ప్ర‌తీ ఇంటికి సంక్షేమ ప‌ధ‌కం అందేలా చూసామ ని చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట్రం అభివృద్ది కోసం అనేక దేశాలు తిరిగినాని..రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం ఎన్నో అభివృద్ది ప‌నులు చేసాన‌ని వివ‌రించారు. అయినా..ప్ర‌జ‌లు ఎందుకు తిర‌స్క‌రించారో అర్దం కాలేద‌ని వాపోయారు. అయితే, కుప్పం ప్ర‌జ‌లు మాత్రం త‌న‌ను మూడు ద‌శాబ్దాలుగా ఆదరిస్తూనే ఉన్నార‌న్నారు. ఈ నియోజక‌వ‌ర్గం మా స్వ‌గ్రామం కాక‌పోయి నా ఇక్క‌డి నుండే ప్ర‌తీ సారి పోటీ చేస్తున్నాన‌ని..ఇక్క‌డి నుండే చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. నియోజకవర్గ స్థాయి అధికా రులతో చంద్రబాబు సమావేశమయ్యారు.

English summary
TDP Chief Chandra babu second day tour in Kuppam with emotional touch. Chandra Babu warned Govt to control attacks on TDP cadre. If Govt not taken serious steps he will be sit in that villages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X