కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనాను జయించిన శతాధిక వృద్దురాలు.. ఆరోగ్య రహస్యాలివేనా..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వస్తే ధైర్యంగా ఉండి ట్రీట్‌మెంట్ తీసుకుంటే సరిపోతోంది. కానీ కొందరు మాత్రం భయపడిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతోన్నా కంగారుపడుతున్నారు. అయితే శతాధిక వృద్దురాలు.. పిల్లలు కూడా వైరస్ నుంచి కోలుకుంటున్నారు. అయితే కర్నూలుకి చెందిన శతాధిక వృద్దురాలు కూడా కరోనా వైరస్ జయించారు. ఎలా జయించారనే అంశాలను వివరించారు.

ఏపీలో నో, హైదరాబాద్ ఓకే.. కరోనా వైద్యం కోసం మంత్రుల బాట, సీపీఐ రామకృష్ణ లేఖాస్త్రంఏపీలో నో, హైదరాబాద్ ఓకే.. కరోనా వైద్యం కోసం మంత్రుల బాట, సీపీఐ రామకృష్ణ లేఖాస్త్రం

కర్నూలు పాతబస్తీ పెద్దపడఖానావీధికి చెందిన బీ మోహనమ్మ కరోనా వైరస్ జయించారు. ఆమె వయస్సు 105 ఏళ్లు కాగా.. భర్త మరణించారు. వారికి ఎనిమిది మంది పిల్లలు కాగా.. వారిలో ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. కానీ కర్నూలులో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి కరోనా పరీక్షలు చేస్తున్నారు.

105 year old woman recovered from coronavirus..

మోహనమ్మ నుంచి శాంపిల్స్ సేకరించగా పాజిటివ్ వచ్చింది. దీంతో గత నెల 19వ తేదీన కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. స్వల్ప జ్వరం మినహా మిగిలిన లక్షణాలు ఏమీ లేవు. ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆయాసం రావడంతో ఆక్సిజన్‌ ఏర్పాటు చేశారు. దవాఖానలో ఆమెకు తోడుగా కుమారుడు ఉన్నారు. వైరస్ తగ్గడంతో గత నెల 31న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు.

కరోనా వచ్చినా మోహనమ్మ మనో నిబ్బంగా ఉన్నారు. ప్రతిరోజూ యోగా, ధ్యానం, వాకింగ్‌ చేసేవారు. వయస్సు దృష్ట్యా మితాహారం తీసుకునేవారు. బీపీ, షుగర్‌ ఉన్నా యోగా వల్ల అవన్నీ కంట్రోల్‌లో ఉన్నాయి. ఆరోగ్యకర అలవాట్ల ఆమె కరోనాను జయించారు.

English summary
105 year old woman recovered from coronavirus at kurnool city. she is doing yoga, walking, meditation in the hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X