కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 15 మంది మృతి..

|
Google Oneindia TeluguNews

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రవైట్ బస్సు, తుఫాన్ వ్యాన్ తోపాటు టూ వీలర్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. జిల్లాలోని వెల్దుర్తి క్రాస్ రోడ్డు వద్ద ఓ ప్రైవేట్ బస్సు అతివేగంతో డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న తుఫాను వాహానంతో పాటు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టినట్టు సమాచారం. కాగా మృతులు గద్వాల జిల్లా శాంతినగర్ మండలం రామపురం గ్రామస్థులుగా గుర్తించారు.

తెలంగాణలోని జోగులాంబా గద్వాల జిల్లా లోని వడ్డేపల్లి మండలం రామాపురం మాజీ సర్పంచి రెండవ కుమారుడు శ్రీనాథ్ నిశ్చితార్థానికి అనంతపురం గుంతకల్లు వెళ్లి శుభాకార్యం చూసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా మొత్తం తుఫాన్ వ్యాన్ లో 17 మంది ప్రయాణిస్తుండగా వీరు ఒక శుభకార్యానికి వెళ్ల వస్తున్నారు.

 13 were died in a bus and van accident

తుఫాన్ వాహానాంలో డ్రైవర్ తోపాటు 17 మంది ప్రయాణించారు. కాగా అందులో 13 మంది అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మ‌ృతిచెందారు. దీంతోపాటు ఎదురుగా ఢీకొన్న టూవీలర్ పై వస్తున్న వ్యక్తి కూడ ఆసుపత్రిలో మృతిచెందాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తోపాటు మొత్తం 16 మంది మృత్యువాత పడ్డారు. అయితే కాగా మృతి చెందిన వారిని పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా పోలీసులు సంఘటనా చేరుకున్న పోలీసులు గాయాల పాలైన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

మృతుల వివరాలు..
మృతులంతా ఓకే గ్రామానికి చెందిన వారు కాగా అందులో రంగస్వామీ (డ్రైవర్ ) మాల రాముడు, మాల సురేశ్, మునిస్వామీ, శాలన్న, వెంకటరాముడు, మాసూం పౌలన్న, గోపినాథ్, చింతలన్న తోపాటు మాల భాస్కర్ ,పరశురాము, తిక్కయ్య, మాల నాగరాజు, మాల చిన్న, సోమన్న ,క్రిష్ణలు ఉన్నారు.కాగా వీరంతా 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపువారే కాగా చాల దగ్గరి బంధువులు కూడా..

English summary
13 dead and several injured after two vehicles collided in Veldurthi of Kurnool district today. More details awaited.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X