కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువతికి 26..యువకుడికి 19 ..ఫేస్ బుక్ ప్రేమ ,పెళ్లి .. ఆపై మోసం, ధర్నా కథ !!

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియా వేదికగా ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమ వ్యవహారంలో అన్నీ ట్విస్టులే . యువకుడికి 19 ఏళ్ల వయసు, యువతి 26 ఏళ్ల వయసు అయినా వయసుతో సంబంధం లేకుండా పెద్దలకు తెలియకుండా ఏకంగా పెళ్లి చేసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అబ్బాయి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమ్మాయి ప్రేమ, పెళ్లి ఆపై ధర్నా కథ నేటి ప్రేమాయణాలకు అద్దం పడుతుంది.

ఫేస్ బుక్ లో ప్రేమ .. తనకంటే చిన్నవాడితో పెళ్లి

ఫేస్ బుక్ లో ప్రేమ .. తనకంటే చిన్నవాడితో పెళ్లి

తన కంటే చిన్నవాడైన యువకుడితో ఫేస్ బుక్ ద్వారా ప్రేమలో పడింది ఓ అమ్మాయి. ఆ ప్రేమ కాస్త పెళ్లి దాకా వెళ్ళింది. కర్నూలు జిల్లా నందవరంకి చెందిన డిగ్రీ చదువుతున్న అబ్బాయి, హైదరాబాద్ లో నివాసం ఉంటున్న వరంగల్ జిల్లాకు చెందిన యువతితో సోషల్ మీడియా ద్వారా ప్రేమాయణం సాగించి ఏకంగా పెళ్లి చేసుకున్నాడు.ఫేస్ బుక్ లో పరిచయమైన మూడు నెలలకాలంలోనే ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు ఆ జంట.

ఇంటికి వెళ్ళి తిరిగిరాని యువకుడు .. ధర్నాకు దిగిన యువతి

ఇంటికి వెళ్ళి తిరిగిరాని యువకుడు .. ధర్నాకు దిగిన యువతి

కర్నూల్ కి వెళ్లి తన తల్లిదండ్రులను చూసి వస్తానని చెప్పి వెళ్లిన యువకుడు తిరిగి రాకపోవడంతో యువతి సదరు యువకుడు ఇంటిముందు ఆందోళన బాట పట్టింది.
వయస్సుతో ప్రమేయం లేకుండా తనకంటే చిన్న వాడిని పెళ్లి చేసుకున్న యువతి, అంతా సజావుగా జరుగుతుంది అని భావించింది. కానీ ఇంటికి వెళ్లి తిరిగి రాని యువకుడి తీరుతో తనకు మోసం జరిగిందని అంటూ కర్నూలు జిల్లా నందవరంలో యువకుడి ఇంటిముందు ఏకంగా ధర్నా మొదలుపెట్టింది.

మూడునెలల ప్రేమ , పెళ్లి .. మోసం చేశాడని ఆక్రోశం

మూడునెలల ప్రేమ , పెళ్లి .. మోసం చేశాడని ఆక్రోశం

వరంగల్ కు చెందిన ఆ యువతి హైదరాబాద్ లో తల్లిదండ్రులతో కలిసి కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుండేది.ఆమె తనను సదరు యువకుడు జులై 4న పెళ్లి చేసుకున్నాడని ఆ తర్వాత కుటుంబ సభ్యులను కలిసి వస్తానని చెప్పి వెళ్ళి తిరిగి రాలేదని, తనను మోసం చేశాడని , న్యాయం కావాలనిడిమాండ్ చేస్తుంది. మూడు నెలల సోషల్ మీడియా పరిచయంతో ప్రేమ, ఆపై పెళ్లి చేసుకుని ఇప్పుడు మోసపోయానని లబోదిబోమంటుంది.

యువతికి అండగా మహిళా సంఘాలు .. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు

యువతికి అండగా మహిళా సంఘాలు .. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు

తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిన యువతికి స్థానిక మహిళా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ప్రేమ పేరుతో మోసం చేశాడని యువకుడి ఇంటి ముందు యువతి ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లి, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
The two fell in love when they were introduced through Facebook as a social media platform. The young man was 19 years old and the young woman was 26 years old. The story of a boy from the state of Andhra Pradesh, a girl from the state of Telangana who falls in love, gets married and Protest mirrors today's love affairs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X