కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలు, ‌నల్లమల అటవీ గ్రామాల్లో పులి సంచారం...

|
Google Oneindia TeluguNews

కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పులి జాడలు కనిపించాయి. అటవీ సమీప గ్రామాల్లో సంచరిస్తున్న పులి గ్రామంలో ఓ ఆవుపై దాడి చేసి చంపేసిన అనవాళ్లు కనిపించాయి. పులి తిరుగుతున్న వార్తలు ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లో అలజడి చెలరేగాయి.దీంతో స్థానికలు భయాందోళనలకు గురవుతున్నారు.

కర్నూలు జిల్లా బండిఅత్మకూరు మండలంలోని సింగవరం గ్రామం నల్లమల అడవి ప్రాంతానికి సమీపంలో ఉంది. అయితే గ్రామంలోని పోలాల్లో మేస్తున్న ఆవు అకస్మత్తుగా చనిపోయింది. దీంతో ఆవుపై పులి దాడి చేసిన చాయలు కనిపించాయి. ఈనేపథ్యంలో భయభ్రాంతులకు లోనైన ప్రజలు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

 A Tiger attack the cow near nallamalla forest in karnool district

దీంతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారులు అవి అడుగులుగా నిర్దారించారు. దీంతో ప్రజలు ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించారు. కాగా గత కొద్ది రోజులుగా అటవీ ప్రాంతంలో వివిధ జంతువులు వస్తుండడంతో వాటి వేట కోసం పులులు తిరుగుతున్నట్టు స్థానిక ప్రజలు చెబుతున్నారు.దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

English summary
a tiger attack the cow near nallamalla forest in Singavaram village in Bandi Atmakur mandal of karnool district,as this reason People who are terrified of this situation have informed forest officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X