కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.25 లక్షలు వద్దు.. న్యాయం చేయండి, అబ్దుల్ సలామ్ అత్త, ఆ పోలీసులను విధుల నుంచి తొలగించాలని..

|
Google Oneindia TeluguNews

అబ్దుల్ సలామ్ అత్త మాబూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సలామ్ కుటుంబం సూసైడ్ చేసుకోవడంతో ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.25 లక్షలు అందజేస్తామని తెలిపింది. అయితే ఆ మొత్తం తీసుకునేందుకు మాబూ నిరాకరించారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. చేయని తప్పుకు వేధించడం వల్లే సలామ్ కుటుంబం బలవన్మరణానికి పాల్పడిందని చెప్పారు.

అసలు నిందితులకు శిక్ష..

అసలు నిందితులకు శిక్ష..

బంగారం షాపులో చోరీ చేసిన అసలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సలాం ఫ్యామిలీని వేధించిన సీఐ, హెడ్ కానిస్టేబుల్‌కు బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలని కోరారు. వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని మాబూని డిమాండ్ చేశారు. ఇటు నంద్యాలలో మహిళా ఎస్‌ఐ, కానిస్టేబుల్ రాత్రి 10 గంటలకు అబ్దుల్ సలాం ఇంటికి వెళ్లారు. తెల్లకాగితంపై సంతకం చేయాలని పోలీసులు అబ్దుల్ సలాం అత్తపై ఒత్తిడి తీసుకొచ్చారు. భయంతో సబ్ కలెక్టర్ కల్పనా కుమారికి అబ్దుల్ సలాం అత్త ఫోన్ చేశాడు. సబ్ కలెక్టర్ జోక్యంతో పోలీసులు వెనక్కు వెళ్లిపోయారు.

సీఐ, హెడ్ కానిస్టేబుల్..

సీఐ, హెడ్ కానిస్టేబుల్..

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్​ ఆదివారం అరెస్ట్ చేశారు. దొంగతనం కేసుకు సంబంధించి పోలీసులు వేధించారని అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు పోలీసుల తీరును వివరిస్తూ సెల్పీ వీడియో షూట్ చేశాడు.

వీడియో వైరల్..

వీడియో వైరల్..

కుటుంబం సామూహిక ఆత్మహత్య తర్వాత వీడియో పోలీసులకు లభించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరలయ్యింది. కేసుతో సంబంధం ఉన్న సీఐ, హెడ్ కానిస్టేబుల్​ను విధుల నుంచి తప్పించారు. సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను కోర్టులో హాజరుపరచగా నంద్యాల జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు వారం రోజులు రిమాండ్ విధించింది. వారు దాఖలు చేసిన పిటిషన్ మేరకు ఇద్దరి పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది.

English summary
auto driver abdul salaam aunt refuses 25 lakhs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X