కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపిలో మ‌రో ఏయిర్‌పోర్ట్ సిద్దం: జ‌న‌వ‌రి 7న ప్రారంభం..

|
Google Oneindia TeluguNews

ఏపి లో మ‌రో నూత‌న విమ‌నాశ్ర‌యం అందుబాటులోకి రానుంది. ఇప్ప‌టికే ఉన్న విమానాశ్రాయ‌ల‌కు తోడుగా రాయ‌ల‌సీమ లో ఈ ఏయిర్ పోర్టు సిద్ద‌మైంది. ఎయిర్ పోర్టు ను అందుబాటులోకి తెచ్చే క్ర‌మంలో భాగంగా ట్రెయిల్ ర‌న్ నిర‌న్వ‌హించా నే. ఆ ర‌న్ స‌క్సెస్ కావటంతో...విమానాశ్ర‌యానికి తుది మెరుగులు దిద్దుతున్నారు.

ఏపి లోని రాయల‌సీమ ప్రాంతంలో మ‌రో ఏయిర్ పోర్టు సిద్దం అవుతోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో ట్రయల్ రన్ విజయవంతమైంది. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి పయనమైన విమానం ఓర్వకల్లు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులో విజయవంతంగా ల్యాండ్ అయింది. జనవరి 7 నుంచి ఈ విమానాశ్రయం ప్రయాణికులకు అందుబా టులోకి రానుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జనవరి 7న ప్రారంభం కానున్న ఈ ఎయిర్‌పోర్టు రాయలసీమలో నాలుగో ఎయిర్‌పోర్టుగా రికార్డులకెక్కనుంది. ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ ప్రాంతంలో తిరుప‌తి, క‌డ‌ప‌, పుట్ట‌ప‌ర్తి విమానాశ్ర‌యా లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఓర్వ‌క‌ల్లు సైతం సిద్దం కావ‌టంతో..మ‌రింత వెసులుబాటు క‌ల‌గ‌నుంది.

Another Air port in AP : Inaugurated on 7th Jan..

ఓర్వ‌క‌ల్లును పారిశ్రామ‌క హ‌బ్ గా అభివృద్ది చేస్తామ‌ని గ‌తంలోనే ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. ఇందు కోసం ఆ ప్రాంతం లో ర‌వాణా సౌక‌ర్యాలు మెరుగు ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌నే ఆలోచ‌న‌తో విమానాశ్ర‌యానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 999.50 ఎకరాలను ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ అధారిటీకి కేటాయించింది. రూ.90.5 కోట్లతో 2017 జూన్‌లో పనులు చేపట్టారు. కీలకమైన రన్‌వే, అప్రాన్‌, టర్మినల్‌, టవర్‌ భవనం, అప్రోచ్‌ రోడ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. తుది మెరుగులు పూర్తి చేసుకొని జ‌న‌వ‌రి 7న ఈ కొత్త ఎయిర్ పోర్టు అందుబాటులోకి రానుంద‌ని అధికారులు ప్ర‌క‌టించారు.

English summary
Another Air port ready for inaguration in AP. Orvakallu Air port in Kurnool dist today done trail run by aviation staff. it has been success. This air port open on 7th january.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X