కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు తరలింపుపై న్యాయవాదుల్లో చీలిక..... విధుల బహిష్కరణ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుతో ఇప్పటికే ఆ ప్రాంత ప్రజల నుండి ఆందోళనలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరో అందోళన ప్రారంభమయ్యె సంకేతాలను కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తరలింపు న్యాయవాదుల్లో భిన్న వాదనలు వినిపించాయి. కోర్టు తరలింపు ఏర్పాటైన ఏపీ బార్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం కొంత రసభాసగా మారింది. సమావేశంలో హైకోర్టు తరలింపును కొంతమంది న్యాయవాదులు వ్యతిరేకించగా మరికొంతమంది సమర్ధించారు.

రాష్ట్రపతి, ప్రధానికి అమరావతి రైతుల లేఖలు : రాజధాని తరలింపు ఆపాలంటూ!రాష్ట్రపతి, ప్రధానికి అమరావతి రైతుల లేఖలు : రాజధాని తరలింపు ఆపాలంటూ!

ఈనేపథ్యంలోనే నేడు సమావేశం అయిన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సమావేశం జరిగింది. దీంతో హైకోర్టును తరలించవద్దని బార్ అసోసియోషన్ తీర్మాణం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈనెల 26, 27 తేదీల్లో విధులు బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. అయితే బార్ కౌన్సిల్ తీర్మాణంపై అడ్వకేట్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొంతమంది తీర్మాణాన్ని వ్యతిరేకించగా మరికొంతమంది సమర్ధించారు. దీంతో కాసేపు గందరగోళం ఏర్పడింది.

AP Bar Council opposed High Court moving to kurnool

కాగా రాజధాని నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర రాజధాని ఏర్పాటు , సమగ్ర అభివృద్దిపై ఏర్పాటైన జీఎన్ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించిన నివేదికపై ఈనెల 27న రాష్ట్ర క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే కోర్టు తరలింపుపై న్యాయవాదులు వ్యతిరేకించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
The AP Bar Council opposed the decision of the AP High Court moving to karnool. It has decided to boycott court on the 26th and 27th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X