కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జగన్ మామయ్య, దిశ చట్టంపై చిన్నారి జ్యోతిర్మయి హర్షం, ముగ్ధుడైన ఏపీ సీఎం

|
Google Oneindia TeluguNews

Recommended Video

YSR Kanti Velugu Scheme Launch : Student Jyothirmayi Speech Going Viral | Oneindia Telugu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడో విడత కంటి వెలుగు పథకాన్ని కర్నూలులో లాంఛనంగా ప్రారంభించింది. సీఎం జగన్మోహన్ రెడ్డి.. నాడు-నేడు వైద్యం, కంటి వెలుగు గురించి వివరించి ఆశీనులయ్యారు. సభా ప్రాంగణమంతా స్తబ్ధుగా ఉంది. ఇంతలో ఓ విద్యార్థిని మైక్ తీసుకొంది. మాట్లాడటం ప్రారంభించింది. జగన్ మామయ్య అంటూ మాట్లాడటంతో సీఎం జగన్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తర్వాత తన వద్దకు తీసుకొని బాగా మాట్లాడావు అని ప్రశంసించారు.

జ్యోతిర్మయి..

జ్యోతిర్మయి..


కర్నూలు ప్రభుత్వ పాఠశాలలో జ్యోతిర్మయి అనే చిన్నారి ఎనిమిదో తరగతి చదువుతున్నారు. మూడో విడత కంటి వెలుగు ప్రారంభ కార్యక్రమం తర్వాత సీఎం జగన్ మాట్లాడారు. తర్వాత మైక్ అందుకొని చిన్నారి మాట్లాడారు. చాలా చక్కగా, స్పష్టంగా తన భావాలను తెలియజేశారు. ఆమె ముచ్చటైన మాటలను చూసి సీఎం జగన్ ముగ్ధుడయ్యారు.

ఆమె మాటల్లోనే..

ఆమె మాటల్లోనే..

బహిరంగ సభలో చిన్నారి జ్యోతిరమ్మయి ఏమన్నారో ఆమె మాటల్లోనే ‘చదువు పట్ల సీఎం జగన్ మామయ్య మనందరికీ ఆసక్తి కలిగిస్తున్నారు. ఇందుకు అందరీ తరఫున కృతజ్ఞతలు అంటూ ప్రారంభించారు. సమాజంలో మహిళలకు రక్షణ లేదు. అందుకోసమే దిశ చట్టాన్ని జగన్ మామయ్య తీసుకొచ్చారని ప్రస్తావించారు. దిశ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసి భద్రత కల్పిస్తున్నారని తెలిపారు. జగన్ మామయ్య అన్నగా, తమ్ముడిగా, కుమారుడిలా, మామయ్యలా అందరి గురించి ఆలోచిస్తున్నారని వివరించారు. దిశ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయడంతో నేరం చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు అని' జ్యోతిర్మయి ప్రస్తావించారు.

వావ్.. సూపర్

వావ్.. సూపర్

అంతేకాదు తనలాంటి పేద విద్యార్థినికి కూడా రక్షణ కల్పించారని.. మెరుగైన విద్యను అందిస్తున్నారని చిన్నారి జ్యోతిర్మయి గుర్తుచేశారు. కర్నూలును జ్యుడిషీయల్ క్యాపిటల్‌గా ఎంచుకున్నందుకు కూడా చిన్నారి ధన్యవాదాలు తెలిపారు. ఆమె మాట్లాడినంత సేపు.. అక్కడున్న వారంతా ఆసక్తిగా తిలకించారు. చిన్నారి చక్కగా మాట్లాడారని అభినందించారు.

English summary
ap cm ys jagan mohan reddy is our uncle child Jyothirmayi said on kurnool stage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X