కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో తొలి పైలెట్‌ శిక్షణా కేంద్రం .. కర్నూలులో ఏర్పాటుకు శ్రీకారం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. కర్నూలులో తొలి పైలట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే అన్ని ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. హైదరాబాదు, బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు దగ్గరగా ఉండటంతో, కర్నూలు లోనూ ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి రానుండడంతో కర్నూలులో పైలట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు కర్నూలు ఎయిర్ పోర్టు విజయదశమి నాటికి అందుబాటులోకి రానుంది.

Recommended Video

AP's First Pilot Training Center| Kurnool Airport విజయదశమి నాటికి కర్నూలు ఎయిర్ పోర్ట్...!!

బస్ భవన్ లో ఏపీ, తెలంగాణా ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ..దసరాకైనా బస్సులు నడుస్తాయా?బస్ భవన్ లో ఏపీ, తెలంగాణా ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ..దసరాకైనా బస్సులు నడుస్తాయా?

 ఫైనాన్షియల్ బిడ్స్ పిలవనున్న ఏపీఏడీసీఎల్

ఫైనాన్షియల్ బిడ్స్ పిలవనున్న ఏపీఏడీసీఎల్

ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మూడు సంస్థలు ముందుకు వచ్చినట్లుగా ఆయన వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలో ఈ శిక్షణా కేంద్రానికి సంబంధించిన ఫైనాన్షియల్ బిడ్ లను పిలువనున్నట్లుగా ఆయన తెలిపారు. శిక్షణా కేంద్ర ఏర్పాటులో భాగంగా సదరు సంస్థ శిక్షణా కేంద్రానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనతో పాటుగా, ఎయిర్ పోర్ట్ ల్యాండ్ వినియోగించుకునేందుకు ఏపీఏడీసీఎల్ కు అద్దె చెల్లించాల్సి ఉంటుంది

. ఇక ఇదే సమయంలో ఆయన కీలక విషయాలను కూడా వెల్లడించారు.

 ఉడాన్ పథకం క్రింద కర్నూలు విమాన సర్వీసులకు మూడు రూట్లు

ఉడాన్ పథకం క్రింద కర్నూలు విమాన సర్వీసులకు మూడు రూట్లు

కర్నూల్ నుంచి కూడా ఉడాన్ పథకం క్రింద అతి తక్కువ ధరలకే విమాన సర్వీసులు నడపడానికి ట్రూజెట్ మూడు రూట్లు దక్కించుకుందని, కర్నూల్ నుండి విజయవాడ, విశాఖ, బెంగళూరు నగరాలకు విమాన సర్వీసులు నడపనున్నట్లు గా ఆయన పేర్కొన్నారు. సుమారు 970 ఎకరాలలో 120 కోట్లతో ఏపీ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కర్నూలు ఎయిర్ పోర్ట్ ను నిర్మించిందని, రెండువేల మీటర్ల పొడవు 30 మీటర్ల వెడల్పుతో ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.

విజయదశమి నాటికి కర్నూల్ ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి

విజయదశమి నాటికి కర్నూల్ ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి

కేంద్ర విమానయాన పౌర సంస్థ నుండి అనుమతులు వస్తే కర్నూలు ఎయిర్ పోర్ట్ ను విజయదశమి నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పగటిపూట మాత్రమే విమానాలు నడుపుతారని రెండవ దశలో రాత్రి వేళ కూడా సర్వీసులు ప్రారంభిస్తారని ఏపీ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి భరత్ రెడ్డి తెలిపారు.

మొత్తానికి ఏపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ,యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించటానికి పెద్ద పీట వెయ్యటమే కాకుండా వివిధ నైపుణ్యాలను నేర్చుకునేలా శిక్షణా సంస్థలను కూడా తీసుకురానుంది .

English summary
The first pilot training center will be set up in the state of Andhra Pradesh. The state government is making plans for this. With the proximity of Hyderabad and Bangalore airports and the availability of airports in Kurnool, it has been decided to set up a pilot training center in Kurnool. Kurnool Airport, on the other hand, will be available by Vijayadashami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X