కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీపీఐలో రాజధాని పంచాయితీ .. రామకృష్ణకు కర్నూలు నేతల షాక్

|
Google Oneindia TeluguNews

జగన్ మూడు రాజధానుల ప్రకటన అటు ఏపీలోని మూడు ప్రాంతాల ప్రజల్లోనే కాదు అటు పార్టీల్లోనూ చిచ్చు పెడుతోంది. తాజాగా రాజధాని అమరావతినే కొనసాగించాలని స్టాండ్ తీసుకుని జగన్ మూడు రాజధానుల ఫార్ములాను వ్యతిరేకిస్తూ చంద్రబాబుతో కలిసి ఉద్యమిస్తున్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అయితే సీపీఐ కర్నూలు జిల్లా నేతలు మాత్రం ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించటంతో సీపీఐ కీలక నేతలకు సొంత పార్టీ నుంచే ఊహించని షాక్ తగిలింది.

రాజధాని అమరావతి కోసం సీపీఐ ముఖ్య నేతల పోరాటం

రాజధాని అమరావతి కోసం సీపీఐ ముఖ్య నేతల పోరాటం

సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు కర్నూలు జిల్లా నేతలు షాక్ ఇస్తున్నారు. రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయలసీమ ప్రాంత నేతల నుంచే సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తుండటంతో రామకృష్ణ సందిగ్ధంలో పడ్డారు .ఏపీకి మూడు రాజధానులంటూ జగన్ ప్రకటన చేసిన నాటి నుండి నేటి వరకు రాజధాని అమరావతి కొనసాగించాలని ఉద్యయం కొనసాగుతుంది. ఇక ఈ పోరాటం మొదలైనప్పట్నించి ప్రస్తుత ఉద్యమం దాకా సీపీఐ రామృష్ణ అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనూ , ఆ తర్వాత చంద్రబాబుతోను కలిసి తిరుగుతున్నారు. రాజధాని రైతుల పోరాటానికి బాసటగా నిలుస్తున్నారు.

Recommended Video

CAA : CPI Leader D. Raja Slams PM Modi & Amit Shah On CAA ! || Oneindia Telugu
రామకృష్ణకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కర్నూలు సీపీఐ నేతలు

రామకృష్ణకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కర్నూలు సీపీఐ నేతలు

చంద్రబాబు బస్సుయాత్ర, భిక్షాటన ఎక్కడ కొనసాగినా ఆయన పక్కనే రామకృష్ణ కూడా ఉండటం గమనార్హం. రాజధాని రైతులకు మద్దతుగా అఖిలపక్షం చేస్తున్న ఆందోళనలలో పాల్గొంటున్న రామకృష్ణకు సోమవారం ఊహించని షాక్ తగిలింది. అమరావతి రాజధానికి మద్దతిస్తున్న ఆయన తీరుపై సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ వాసుల డిమాండ్‌ను పూర్తిగా పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ.. సీపీఐ కర్నూలు జిల్లా కమిటీ రామకృష్ణ విషయంలో ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది.

సీపీఐలోనూ రాజధాని పంచాయితీ .. షాక్ లో రామకృష్ణ

సీపీఐలోనూ రాజధాని పంచాయితీ .. షాక్ లో రామకృష్ణ

రామకృష్ణ తీరుపై కర్నూలు సీపీఐ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కమిటీ తీర్మానాన్ని పార్టీ అధిష్టానానికి పంపిస్తామని స్థానిక నేతలు చెబుతున్నారు. ఇక ఇది సీపీఐ లోనూ చీలిక రాబోతుంది అనే భావన కలిగిస్తుంది. మొత్తానికి సీపీఐ కీలక నేతలు, నారాయణ ,రామకృష్ణలు రాజధాని అమరావతినే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటే ఉత్తరాంధ్ర , రాయల సీమ ప్రానతాల్లోని నేతలు తమ ప్రాంతాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని వీరి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

English summary
Wherever Chandrababu's bus journey and rallies continues, Ramakrishna is also next to him. Ramakrishna, who was involved in all-party agitation in support of capital farmers, suffered an unexpected shock on Monday. The CPI Kurnool district committee has decided against Ramakrishna and take resolution alleging that he completely ignore the demands of Uttarandhra and Rayalaseema residents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X