కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలర్ట్.. అలర్ట్... కర్నూలు పోలీసు కార్యాలయంలో కరోనా కలకలం, రసాయనాలతో క్లీనింగ్..

|
Google Oneindia TeluguNews

కరోనా.. కరోనా... కరోనా... ఈ పేరు వింటేనే గుండె గుబేల్ మంటోంది. దగ్గు, జలుబు ఉన్నవారి దగ్గరికి వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో వైద్యులు, పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. అయితే కర్నూలు జిల్లా హెడ్ కానిస్టేబుల్ కుమారుడు కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. అతను ఇటీవలే విదేశాల నుంచి రావడం.. లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. అయితే వైరస్ సోకిందని భావిస్తోన్న తరుణంలో.. హెడ్ కానిస్టేబుల్ జిల్లా పోలీసు కార్యాలయంలో విధుల్లో భాగంగా తిరిగారు. కార్యాలయంలో 100 మంది వరకు సిబ్బంది, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉండటంతో... అతనికి కూడా వైరస్ ఉందా.. ఆయనతో తాము చనువుగా ఉన్నామని ఆందోళన చెందుతున్నారు.

జర్మనీ నుంచి రాక..

జర్మనీ నుంచి రాక..


కర్నూలులో ఓ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు ఇటీవలే జర్మనీ నుంచి వచ్చారు. అక్కడినుంచి వచ్చినప్పటీ నుంచి అతను అస్వస్థతతో ఉన్నాడు. దగ్గు, జలుబు రావడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతనికి కరోనా పాజిటివ్ వచ్చిందని భావిస్తున్నారు. రక్త నమూనాలను తిరుపతి ఆస్పత్రికి పంపించారు. రిపోర్ట్ రావాల్సి ఉంది.

కుమారుడితో కానిస్టేబుల్..

కుమారుడితో కానిస్టేబుల్..

అయితే కుమారుడు అస్వస్థతగా ఉన్న సమయంలో హెడ్ కానిస్టేబుల్ అతనితో ఉన్నాడు. ఆస్పత్రిలో కూడా చేర్పించాడు. దీంతో వైరస్ కానిస్టేబుల్‌కు కూడా సోకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అతను విధుల్లో భాగంగా కర్నూలు జిల్లా పోలీసు కార్యాయానికి వచ్చేవారు. చాలా మందితో మాట్లాడటంతో... మిగతావారికి కూడా వైరస్ ప్రబలిందా అనే అనుమానం కలిగింది. విషయం బయటకు పొక్కడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.

Recommended Video

CoronaVirus Latest Updates | Helpline Number | Symptoms & Precautions
రసాయనాలతో క్లీన్..

రసాయనాలతో క్లీన్..

కర్నూలు ఎస్పీ ఫకీరప్ప మున్సిపల్ సిబ్బందిని పిలిపించారు. రసాయనాలతో కార్యాలయం మొత్తాన్ని శుభ్రం చేయించారు. ప్రతీ నిత్యం పదుల సంఖ్యలో ఉండే కార్యాలయం ఇప్పుడు ఎవరూ లేకుండా బోసిపోయింది. కర్నూలులో మొత్తం 8 మందికి కరోనా వైరస్ టెస్ట్ చేశారు. అందులో ఇద్దరికీ నెగిటివ్ అని వచ్చింది. మరో ఆరుగురి రిపోర్టులు రావాల్సి ఉంది. హెడ్ కానిస్టేబుల్ కుమారుడు రిపోర్ట్ కూడా వస్తే.. అతనికి వైరస్ ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతోంది. ఒకవేళ అతనికి వైరస్ ఉంటే జిల్లా పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడే అవకాశం ఉంది.

English summary
municipal staff clean the kurnool police office due to coronavirus effect
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X