కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేవరగట్టు కర్రల సమరం ... పోలీసులకు సవాల్ గా.. 144 సెక్షన్ విధించినా సరే టెన్షన్

|
Google Oneindia TeluguNews

కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం అధికారులకు టెన్షన్ పుట్టిస్తోంది. ప్రతి ఏడాది ఆచారంగా విజయదశమి తర్వాత రోజున నిర్వహించే దేవరగట్టు కర్రల సమరాన్ని ఈ ఏడాది పోలీసులు రద్దు చేశారు. కరోనా కారణంగా బన్నీ ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన పోలీసులు, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎవరూ ఈ ఉత్సవాలలో పాల్గొనవద్దని పేర్కొన్నారు. అయితే బన్నీ ఉత్సవాన్ని పోలీసులు రద్దు చేసినప్పటికీ, సాంప్రదాయంగా ఏళ్లతరబడి కొనసాగుతున్న ఈ ఉత్సవాన్ని నిర్వహించి తీరుతామని నిర్వాహకులు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో దేవరగట్టు కర్రల సమరం పై అధికారులకు టెన్షన్ పట్టుకుంది.

 తెరచుకున్న శబరిమల ఆలయం ... 250 మందికే అనుమతి .. కోవిడ్ నిబంధనలతోనే స్వామి దర్శనం తెరచుకున్న శబరిమల ఆలయం ... 250 మందికే అనుమతి .. కోవిడ్ నిబంధనలతోనే స్వామి దర్శనం

ఉత్సవాలను అడ్డుకునే పనిలో పోలీసులు

ఉత్సవాలను అడ్డుకునే పనిలో పోలీసులు

ఎక్కడికక్కడ పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ ఉత్సవాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా మోహరించిన పోలీసులు పహారా కాస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో 11 పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అంతేకాదు సరిహద్దున హాలహర్వి, హోళగొంద, ఆలూరు మండలాలకు తిరిగి కర్ణాటక బస్సు సర్వీసులను కూడా రద్దు చేసిన అధికారులు బన్నీ ఉత్సవం చేయకుండా ఉంచేందుకు తెగ కష్టపడుతున్నారు.ప్రజలకు నచ్చజేప్పీ ప్రయత్నం చేస్తున్నారు .

 దేవరగట్టులో 144 సెక్షన్ .. గ్రామాలలో భారీగా మోహరించిన పోలీసులు

దేవరగట్టులో 144 సెక్షన్ .. గ్రామాలలో భారీగా మోహరించిన పోలీసులు

సాంప్రదాయం పేరుతో ప్రతి ఏడాది దేవరగట్టు కర్రల సమరంలో ప్రజలు రక్తాన్ని చిందిస్తారు. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినప్పటికీ అప్పటినుండి ఇప్పటివరకు పోలీసులు దేవరగట్టు కర్రల సమరంలో హింసను నివారించలేకపోయారు.

ఇక తాజాగా దేవరగట్టు బన్నీ ఉత్సవాలపై పోలీసులు నిషేధం విధించినప్పటికీ సాంప్రదాయంగా కొనసాగించి తీరుతామని ప్రజలు తేల్చి చెప్పడంతో ప్రస్తుతం దేవరగట్టులో 144 సెక్షన్ ను విధించారు. పలు గ్రామాలలో భారీగా మోహరించిన పోలీసులు ప్రజలను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కారణంగా రద్దు చేసినా సమరానికి సై అంటున్న స్థానికులు

కరోనా కారణంగా రద్దు చేసినా సమరానికి సై అంటున్న స్థానికులు

ఇక నేరుగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రయత్నిస్తున్నారు. మంత్రి జయరాం తో ఆదోని డి.ఎస్.పి ,ఆర్టీవో భేటీ అయ్యి దేవర గట్టు కర్రల సమరం పై చర్చించారు కర్రల సమరం చెయ్యకుండా నియోజకవర్గ ప్రజలకు నచ్చచెప్పాలని మంత్రి కోరారు. వేలాదిమంది మంది జనం ఒక చోట కలిస్తే మళ్లీ కరోనా విజృంభించే అవకాశం ఉందని చెబుతున్నారు .అయినా సరే కర్రల సమరానికి స్థానికులు సై అంటున్నారు.

నచ్చజెప్పినా సరే వినిపించుకోని స్థానికులు .. పోలీసులపై ఆగ్రహం

నచ్చజెప్పినా సరే వినిపించుకోని స్థానికులు .. పోలీసులపై ఆగ్రహం


ఇక గ్రామాలలో కర్రలను స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు పోలీసులు . అటు పోలీసులు, అధికార యంత్రాంగం , ప్రజా ప్రతినిధులు దేవరగట్టు కర్రల సమరాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడి ప్రజల్లో అనాదిగా ఆచారంగా ఉన్న మాల మల్లేశ్వర స్వామిపై ఉన్న భక్తి ఏం చేయబోతుందో అనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

పోలీసుల తీరుపై సర్వత్రా స్థానికుల్లో నిరసన వ్యక్తం అవుతుంది.

English summary
Kurnool district Devaragattu stick fight is creating tension for the authorities. This year, the police have canceled the Devaragattu stick fight, which is traditionally held on the day after Vijayadashami. Police announced the cancellation of the bunny festivities due to the corona, saying no one should take part in the festivities in the wake of the corona outbreak. However, despite the cancellation of the bunny festival by the police, the organizers are adamant that the festival, which has traditionally been going on for years, will continue. Against this backdrop, tension gripped the authorities over the Devaragattu stick fight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X