కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీమ కరవు తీరా: కర్నూలు, అనంతల్లో భారీవర్షం: నీట మునిగిన మహానంది: గర్భగుడి వరకూ గంగమ్మ!

|
Google Oneindia TeluguNews

కర్నూలు: రెండురోజులుగా ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాలకు కర్నూలు, అనంతపురం జిల్లాలు తడిచి ముద్దవుతున్నాయి. ప్రత్యేకించి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఈ వర్షాకాలం సీజన్ లో ఇంత భారీగా వర్షం కురవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు- ఈ రెండు జిల్లాల్లో వర్షం పడినప్పటికీ.. ఈ స్థాయిలో నమోదు కాలేదు. వాగులు, వంకలు పొంగిపొర్లేంతగా, పరిసర ప్రాంతాలను ముంచెత్తేలా వర్షం కురుస్తోంది. కర్నూలు జిల్లాలో నల్లమల అడవులకు ఆనుకుని ఉన్న నంద్యాల, ఆత్మకూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం నుంచీ ఒకటే వాన. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల వంటి చోట్ల ఎడతెరిపి ఇవ్వకుండా వర్షం పడుతోంది.

పైకి తేలుతున్న మృతదేహాలు: ధవళేశ్వరం బ్యారేజీ వరకూ కొట్టుకెళ్లినట్టు గుర్తింపుపైకి తేలుతున్న మృతదేహాలు: ధవళేశ్వరం బ్యారేజీ వరకూ కొట్టుకెళ్లినట్టు గుర్తింపు

ఫలితంగా- తాడిపత్రి సమీపంలోని ఆలూరు కోన, కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం మహానంది.. నీట మునిగాయి. మహానంది ఆలయం దాదాపు సగం వర్షపు నీటిలో మునిగిపోయింది. గర్భ గుడి సమీపం వరకూ వర్షపునీరు చేరుకుంది. ఆలయంలోని కోనేరు పూర్తిగా నిండిపోయింది. రోడ్లపైకి ప్రవహిస్తోంది. మహానంది గ్రామంలో ఎటు చూసినా మోకాలి లోతు వరకు నీరు నిల్వ ఉండటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు స్థానికులు. భారీ వర్షాల కారణంగా- మహానందీశ్వరుడి దర్శనాలను రద్దు చేశారు ఆలయ అర్చుకులు. ఆలయంలోని మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. పంచలింగాల మంటపం, కోనేరు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది.

 Flash floods hit five mandals in Kurnool district, mahanandi temple is submerged

కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని మైలవరం వద్ద పెన్నానదిపై నిర్మించిన రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది. గేట్లను ఎత్తివరద ప్రవాహాన్ని దిగువకు వదిలి వేస్తున్నారు అధికారులు. ఫలితంగా దిగువ ప్రాంతాలైన వేపరాల, దొమ్మర నంద్యాల, జమ్మలమడుగులో కృష్ణాజలాలు ప్రవేశించాయి. ఇదే జిల్లాలో చిత్రావతి మీద నిర్మించిన గండికోట ప్రాజెక్టులో పూర్తిగా నిండిపోయింది.
కర్నూలు జిల్లాలోని శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, దొరసానిపాడు, కోవెలకుంట్ల మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శిరివెళ్ల మండలంలో 227.6, గోస్పాడు-226.4, రుద్రవరం-180, మహానంది-168.4, ఆళ్లగడ్డ-119 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది.

 Flash floods hit five mandals in Kurnool district, mahanandi temple is submerged

రాయలసీమలో నిర్మించిన దాదాపు అన్ని రిజర్వాయర్లు నిండుకుండల్లా మారిపోవడం దాదాపు పదేళ్ల తరువాత ఇదే తొలిసారి. అనంతపురం జిల్లాలో శింగనమల, ధర్మవరం చెరువులు నిండిపోయాయి. జలకళను సంతరించుకున్నాయి. వచ్చే 48 గంటల్లో రాయలసీమలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు అంచనా వేశారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు.

English summary
Heavy rain has caused flash floods in Sirivella, Gospadu, Mahanandi, Nandyal, and Rudravaram mandals in Kurnool district in the early hours of Monday. While no deaths have been reported, the authorities expect significant crop and property damage. According to the data received from the Revenue Department, Sirivella mandal received 227.6 millimetres (mm) of rain, Gospadu 226.4 mm, Rudravaram 180 mm, Mahanandi 168.4 mm and Allagadda 119 mm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X