కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలు జిల్లాను ముంచెత్తుతున్న వర్షం ... కర్నూలు-చెన్నై హైవేపై రాకపోకలు బంద్

|
Google Oneindia TeluguNews

కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం దెబ్బకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నంద్యాల, గోస్పాడు, బనగానపల్లె, సరివెళ్ల ప్రాంతాలలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి. చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

సీఎం కేసీఆర్ సంచలనం .. మరో మూడు టర్మ్‌లు టీఆర్ఎస్ నే .. ఇంకో పదేళ్ళు తానే సీఎంసీఎం కేసీఆర్ సంచలనం .. మరో మూడు టర్మ్‌లు టీఆర్ఎస్ నే .. ఇంకో పదేళ్ళు తానే సీఎం

వర్షపునీరు పలు గ్రామాల్లో ఇళ్లలోకి వచ్చి చేరింది. సహాయ కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు . అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Heavy rains in Kurnool district.. Kurnool-Chennai highway bandh

ఇక తాజాగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా జిల్లెలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జాతీయ రహదారిపై జిల్లెల వాగు ప్రవహిస్తున్న కారణంగా కర్నూలు-చెన్నై హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎర్రగుంట్ల గ్రామంలో వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు.

English summary
Heavy rains in Kurnool district. Nandyala, Gospadu, Banaganapalle and other areas have become flooded due to heavy rains. Traffic on Kurnool-Chennai Highway has stopped due to the flood .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X