భర్త ఇంట్లో లేని వేళ.. అతనితో ఏకాంతంగా భార్య... రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు...
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఓ వివాహేతర సంబంధం ఘటన తీవ్ర కలకలం రేపింది. తనతో ఉన్న పరిచయాన్ని అడ్డుపెట్టుకుని తన భార్యతో ఓ నేత సాగిస్తున్న వివాహేతర సంబంధాన్ని ఓ భర్త బట్టబయలుచేశాడు. తన కళ్లుగప్పి ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్న వేళ.. హఠాత్తుగా వెళ్లి వారికి ఊహించని షాకిచ్చాడు. ఇద్దర్నీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అసలేం జరిగింది...
స్థానికుల కథనం ప్రకారం... ఆళ్లగడ్డ పట్టణంలోని రామలక్ష్మీ కొట్టాల రెండో వీధిలో ఓ ఆటో డ్రైవర్ తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతనికి ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తానో సామాజిక వర్గం హక్కుల కార్యకర్తను అని,ఆ సంఘం హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిని సదరు వ్యక్తి ఆటోడ్రైవర్ని నమ్మించాడు. ఈ క్రమంలో ఆ ఆటోడ్రైవర్ ఇంటికి రాకపోకలు సాగించడం మొదలుపెట్టాడు. అలా అతను ఇంట్లో లేనప్పుడు కూడా ఇంటికి వెళ్లి అతని భార్యతో మాట్లాడేవాడు. తాను లేనప్పుడు అతను తన ఇంటికి వెళ్తున్నాడన్న విషయం ఆటోడ్రైవర్కి ఆలస్యంగా తెలిసింది.

వివాహేతర సంబంధం...
తరుచూ ఆ ఆటోడ్రైవర్ ఇంటికి వెళ్తున్న క్రమంలో.. అతని భార్యతో సదరు వ్యక్తికి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆపై అది వివాహేతర సంబంధానికి దారితీసింది.అప్పటినుంచి ఆ ఆటోడ్రైవర్ ఇంట్లో లేని సమయంలోనే అతను అక్కడికి వెళ్తుండేవాడు. అలా అతను వచ్చిపోతున్న విషయాన్ని స్థానికులు గమనించి ఆటో డ్రైవర్ చెవిన వేశారు. దీంతో ఆటోడ్రైవర్ సదరు వ్యక్తిని తన ఇంటికి రావద్దని గట్టిగా మందలించాడు. అయినప్పటికీ అతని తీరులో మార్పు రాలేదు.

రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు...
సోమవారం(నవంబర్ 2) సాయంత్రం ఆ ఆటోడ్రైవర్ ఏదో పని నిమిత్తం ఇంటి నుంచి బయటకెళ్లాడు. ఆ విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి వెంటనే ఆ ఇంట్లో వాలిపోయాడు. ఆటోడ్రైవర్ భార్యతో అతను ఏకాంతంగా గడుపుతున్న వేళ... చుట్టుపక్కలవాళ్లు గమనించారు. ఆటోడ్రైవర్కి ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో.. హుటాహుటిన అతను అక్కడికి చేరుకున్నాడు. ఇంట్లో ఇద్దరు ఉండటం గమనించి బయట నుంచి గడియ పెట్టాడు.అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... ఆటోడ్రైవర్ భార్యను,ఆమెతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బాధితుడు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.