కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలు టీడీపీలో కలకలం: కేఈ ప్రభాకర్ రాజీనామా: మంత్రి హామీ..వైసీపీలోకి ఎంట్రీ..!

|
Google Oneindia TeluguNews

కర్నూలు: స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. వైసీపీ నేతల వలలో టీడీపీ నేతలు ట్రాప్ అవుతున్నారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో సీఎం సొంత జిల్లా కడప నుండి ఇద్దరు కీలక నేతలు వైసీపీకి దగ్గరయ్యారు. కాగా, అనంతనుండి సీనియర్ మహిళా టీడీపీ నేతలు పార్టీ వీడాలని నిర్ణయించారు. ప్రకాశం నుండి కీలక నేతలు వైసీపీ బాట పట్టారు. ఇక, ఇప్పుడు కర్నూలు జిల్లాలో వలసలు మొదలు అయ్యాయి.

టీడీపీకి కేఈ ప్రభాకర్ గుడ్ బై

టీడీపీకి కేఈ ప్రభాకర్ గుడ్ బై

కర్నూలు జిల్లాలో రాజకీయంగా పేరున్న కేఈ కుటుంబం నుండి ఇప్పుడు వలస బాట పడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేఈ ప్రభాకర్ టీడీపీ వీడాలని నిర్ణయించారు. 2019 ఎన్నికల ముందు నుండి ఆయన పార్టీ అధినాయకత్వం తీరు పట్ల అసహనంతో ఉన్నారు. అయితే, ఫలితాల తరువాత నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో అప్పట్లో పార్టీ మార్పు ప్రతిపాదన ఆయన సోదరుడు కేఈ క్రిష్ణమూర్తి సూచన మేరకు విరమించుకున్నారు. అయితే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేఈ ప్రభాకర్ టీడీపీ వీడాలని డిసైడ్ అయ్యారు.

టీడీపీలో మాజీ మంత్రిగా...

టీడీపీలో మాజీ మంత్రిగా...

టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టికెట్ల కేటాయింపు విషయమపై ఆయన నిరసనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు ఆయన డిసైడ్ అయ్యారు. తాను ఎందుకు టీడీపీ వీడుతున్నానో వారికి వివరించి..వారికి తన రాజకీయ భవిష్యత్ పైన తన ఆలోచన ఏంటనేది స్పష్టత ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అనుచరులకు పార్టీ టిక్కెట్లు ఇవ్వకుండా..నిర్లక్ష్యం చేయటం పైనా ప్రభాకర్ ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తన సోదరుడికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కేఈ క్రిష్ణమూర్తి గట్టిగా పట్టుబట్టారు. ఆ సమయంలో కేఈ ప్రభాకర్ పార్టీ వీడుతన్నారనే ప్రచారం సాగింది. అయితే, ఆ సమయంలో ఆయనకు ఎమ్మెల్సీతో పాటుగా నామినేటెడ్ పదవిని సైతం చంద్రబాబు కేటాయించారు. కానీ, 2019 ఎన్నికల్లో కేఈ కుటుంబానికి పత్తికొండ సీటు ఇచ్చినా..అక్కడ నుండి వైసీపీ అభ్యర్ధి శ్రీదేవి చేతిలో పరాజయం పాలయ్యారు.

Recommended Video

TDP Leader Ramasubba Reddy Joins In YCP In The Presence Of CM YS Jagan | Oneindia Telugu
ఇటు భూమా కుటుంబాల నడుమ..

ఇటు భూమా కుటుంబాల నడుమ..


తాము తొలి నుండి టీడీపీని నమ్ముకొని ఉండగా..తమపై పోరాటం చేసిన ప్రత్యర్ది వర్గమైన కోట్ల కుటుంబాన్ని టీడీపీలోకి తీసుకోవటం దగ్గర నుండి కేఈ కుటుంబం టీడీపీ అధినాయకత్వం పైన ఆగ్రహంతో ఉంది. అదే సమయంలో కేఈ క్రిష్ణమూర్తికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా..అధికారాలు మాత్రం ఇవ్వలేదని పలుమార్లు ఆయనే స్వయంగా వాపోయారు. రాజధాని వ్యవహారంలో రెవిన్యూ మంత్రిగా ఎక్కడా కేఈ కి ప్రమేయం లేకుండా మొత్తంగా నాటి మున్సిపల్ మంత్రి నారాయణకే చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వటం పైనా పలుమార్లు కేఈ ఓపెన్ గానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, భూమా అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వటం..జిల్లాలో వర్గ రాజకీయాలు పెరగటం కేఈ కుటుంబం ఇక పార్టీలో ఉండలేమనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ..జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ మంతనాలతో కేఈ ప్రభాకర్ వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన తమ అనుచరులతో సమావేశమై..అధికారికంగా తమ నిర్ణయం ప్రకటించనున్నారు.

English summary
Its a big shock to Chandrababu and TDP as the main leader from Kurnool and former minister KE Prabhakar had resigned to the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X