కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్లాస్మా దానం చేసిన కర్నూలు ఎమ్మెల్యే: పలువురికి ఆదర్శంగా నిలిచిన సుధాకర్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ను జయించడం అంటే మృత్యువును జయించినట్టే.. వైరస్ గురించి రకరకాలుగా వైద్య నిపుణులు చెబుతున్నా.. కరోనా పేరు చెబితే విద్యావంతులైనా సరే పరుగుతీస్తున్నారు. అయితే వైరస్ వచ్చి తగ్గిన వారు.. ప్లాస్మా దానం చేసే అవకాశం ఉంది. వైరస్ గురించి అవగాహన ఉండి.. ప్లాస్మాను చాలా మంది డోనెట్ చేస్తున్నారు. అలా కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే జే సుధాకర్ ప్లాస్మా దానం చేశారు. ఎమ్మెల్యే ప్లాస్మా దానం చేసి.. మిగతా వారికి ఆదర్శంగా నిలిచారు.

అయోధ్యలో మందిర నిర్మాణంతో కరోనా వైరస్ నిర్మూలన: బీజేపీ ఎంపీ మీనా సంచలన వ్యాఖ్యలు..అయోధ్యలో మందిర నిర్మాణంతో కరోనా వైరస్ నిర్మూలన: బీజేపీ ఎంపీ మీనా సంచలన వ్యాఖ్యలు..

వైరస్‌ను జయించి..

వైరస్‌ను జయించి..


గతనెలలో ఎమ్మెల్యే సుధాకర్‌కు కరోనా వైరస్ సోకింది. వైద్యుల సూచనతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే ఆయన ఇటీవల వైరస్ నుంచి కోలుకున్నారు. వైరస్ గురించి అవగాహన ఉండటంతో.. ప్లాస్మా డొనెట్ చేయడానికి ముందుకొచ్చారు. కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంకులో వైద్యులు మంగళవారం ప్లాస్మా తీశారు. అతని రక్తం నుంచి 400 మిల్లీ లీటర్ల ప్లాస్మాను సేకరించారు.

ప్లాస్మా థెరపీ అంటే

ప్లాస్మా థెరపీ అంటే

రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్నవారిపై కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది. వారి శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే తెల్ల రక్త కణాలు దాడి చేసి వైరస్‌ను నాశనం చేస్తాయి. కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వారి రక్తంలో రోగనిరోధక కణాల సంఖ్య బాగా వృద్ధి చెంది ఉంటుంది. మరికొందరిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. వారిపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక కణాలనుపెంచితే వ్యాధిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరిస్తారు. వైరస్‌తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి ఎక్కించడంతో వారు వేగంగా కోలుకుంటారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ప్లాస్మాను కరోనా సోకిన రోగిలో ఎక్కించడాన్నే ప్లాస్మా థెరపీ అని పిలుస్తారు.

Recommended Video

Dr.Sudhakar Praises AP CM Jagan And Requesting To Give His Job Back
 ఏపీలో కరోనా విలయం

ఏపీలో కరోనా విలయం

మరోవైపు ఏపీలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజుకు కనీసం 7 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు రావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 10వేలు దాటింది. మరి కొద్దిరోజుల్లో ఢిల్లీని దాటి మూడో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. ఢిల్లీలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య లక్ష 30 వేలకు పైగానే ఉంది. తొలి, రెండు స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి.

English summary
kodumur mla sudhakar donated plasma in kurnool state covid hospital blood bank in tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X