కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపి లోకి ఎస్వీ మోహ‌న రెడ్డి : క‌ర్నూలు లో మారుతున్న స‌మీక‌ర‌ణాలు: ఎవ‌రి స‌త్తా ఏంటి ..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల వేళ క‌ర్నూలు జిల్లాలో రాజ‌కీయ స‌మీర‌ణాలు వేగంగా మారిపోతున్నాయి. వైసిపి నుండి గెలిచి టిడిపి లో చేరిన నేత‌ల్లో ఇప్ప‌టికే బుట్టా రేణుక తిరిగి వైసిపి లో చేరారు. తాజాగా క‌ర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న రెడ్డి తిరిగి వైపిపిలోకి రావాల‌ని నిర్ణ‌యించారు. చేసిన త‌ప్పు స‌రి దిద్దుకుంటాన‌ని చెబుతున్నారు. ఇక‌, టిడిపిలో సీటు ద‌క్క‌క‌పోవ‌టంతో మాజీ ఎంపి ఎస్పీవై రెడ్డి జ‌న‌సేన లో చేరారు.

ఎన్నారైలు కోటిన్నర..! ఓట్లున్నాయి 70 వేలే.. 0.5 శాతమేనా? ఎన్నారైలు కోటిన్నర..! ఓట్లున్నాయి 70 వేలే.. 0.5 శాతమేనా?

వైసిపిలోకి ఎస్వీ మోహ‌న రెడ్డి..

వైసిపిలోకి ఎస్వీ మోహ‌న రెడ్డి..

క‌ర్నూలు నుండి 2014 ఎన్నిక‌ల్లో వైసిపి నుండి పోటీ చేసి గెలిచిన ఎస్వీ మోహ‌న రెడ్డి ఆ త‌రువాతి కాలంలో టిడిపి లోకి ఫిరాయించారు. సోద‌రి శోభా నాగిరెడ్డి మృతి త‌రువాత బావ నాగిరెడ్డి..కోడ‌లు అఖిల ప్రియ తో క‌లిసి ఆయ‌న టిడిపిలో చేరారు. జ‌గ‌న్ పై అనేక ఆరోప‌ణలు చేసారు. ఇక‌, అఖిల ప్రియ‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కిన త‌రువాత మోహ‌న రెడ్డికి ప్రాధా న్య‌త త‌గ్గ‌తూ వ‌చ్చింది. ఇక‌, ఈ ఎన్నిక‌ల్లో మోహ‌న రెడ్డికి పోటీగా రాజ్య‌స‌భ స‌భ్యుడు టిజి వెంక‌టేష్ త‌న‌యుడు భ‌ర‌త్ తెర మీద‌కు వ‌చ్చారు. అయితే, సీటు మాత్రం మోహ‌న‌రెడ్డికే ఇస్తామ‌ని లోకేష్ నుండి హామీ వ‌చ్చింది. చివ‌ర‌కు అనేక తర్జ‌న భ‌ర్జ‌న త‌రువాత మోహ‌న రెడ్డిని కాద‌ని...టిజి వెంక‌టేష్ త‌న‌యుడు భ‌ర‌త్ కు క‌ర్నూలు సీటు కేటాయించారు. దీంతో మ‌న‌స్థాపానికి గురైన మోహ‌న రెడ్డి తిరిగి వైసిపిలో చేరాల‌ని నిర్ణ‌యించారు.

త‌ప్పు స‌రిదిద్దుకుంటాను..

త‌ప్పు స‌రిదిద్దుకుంటాను..

వైసిపి నుండి టిడిపిలో చేరి ఇప్పుడు తిరిగి వైసిపి లో చేరాల‌ని నిర్ణ‌యించిన ఎస్వీ మోహ‌న రెడ్డి తాను చేసిన త‌ప్పు స‌రి దిద్దుకుంటాన‌ని చెబుతున్నారు. బుట్టా రేణుక త‌ర‌హాలోనే ఆయ‌న తిరిగి వైసిపికి మ‌ద్ద‌తుగా ప‌ని చేయ‌నున్నారు. వైసిపి లో ఇప్ప‌టికే క‌ర్నూలు ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా మైనార్టీ వ‌ర్గానికి చెందిన హ‌ఫీజ్ ఖాన్ కు కేటాయించారు. తాను టిజి వెంక‌టేష్ కంటే నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ది చేసాన‌ని..అయినా త‌న‌కు టిడిపిలో గుర్తింపు ఇవ్వ‌లేద‌ని చెబుతున్నారు. ఇక‌, ఇప్పుడు వైసిపి లో మోహ‌న రెడ్డి తిరిగి ఎంట్రీ ఇచ్చినా..ఎంత మేర ఆద‌ర‌ణ ఉంటుందీ..ఏ మేర ప్ర‌భావం చూపిస్తార‌నేది వేచి చూడాల్సి ఉంటుంది.

జిల్లాలో మారుతున్న స‌మీక‌ర‌ణాలు..

జిల్లాలో మారుతున్న స‌మీక‌ర‌ణాలు..

జిల్లాలో రెండు లోక్‌స‌బ‌..14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ నుండి టిడిపిలో చేరిన సీనియ‌ర్ నేత కోట్ల సూర్య ప్ర‌కాశ్ రెడ్డికి టిడిపి నుండి క‌ర్నూలు ఎంపి సీటు కేటాయించారు. అదే విధంగా నంద్యాల నుండి మాజీ పోలీసు అధికారి శివానంద‌రెడ్డికి ఎంపి సీటు ఖ‌రారు చేసారు. వైసిపి నుండి కర్నూలు నుండి బిసి వ‌ర్గానికి చెందిన కొత్త అభ్య‌ర్ది డాక్ట‌ర్ సంజీవ్ కుమార్ కు..నంధ్యాల సీటు బ్ర‌హ్మానంద‌రెడ్డికి కేటాయించారు. ఇక‌, నంద్యాల మాజీ ఎంపి ఎస్పీ వై రెడ్డికి టిడిపి సీటు ఇవ్వ‌క‌పోవ‌టంతో ఆయ‌న జ‌న‌సేన నుండి నంద్యాల బ‌రిలో దిగుతున్నారు. ఇక‌, ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యా ల నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కే టిడిపి అవ‌కాశం ఇవ్వ‌గా..వైసిపి మాత్రం గంగుల వార‌సుడికి ఆళ్ల‌గ‌డ్డ‌..శిల్పా వార‌సుడికి నంద్యాల అసెంబ్లీ సీట్లు కేటాయించారు. ఇక‌, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఐజ‌య్య ..బైరెడ్డి రాజ‌శేఖ‌ర రెడ్డి టిడిపి లో చేరారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసిపి కొత్త అభ్య‌ర్దిని బ‌రిలోకి దించింది. పాణ్యం సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చ‌రిత టిడిపి నుండి..అక్క‌డ సీనియ‌ర్ నేత కాట‌సాని రాం భూపాల్ రెడ్డి వైసిపి నుండి బ‌రిలో ఉన్నారు. మొత్తానికి క‌ర్నూలు జిల్లా లో రాజ‌కీయం ఈ సారి ఆస‌క్తి క‌రంగా మ‌రింది.

English summary
Kurnool sitting mla SV Mohan reddy decided to go back to YCP. He did not get seat form TDP. In YCP Kurnool seata already alloted to Hafiz Khan. Now, Kurnool poliltics becoming more interest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X