కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్! సుగాలి ప్రీతికి న్యాయం చేయండి: చేతులు జోడించిన పవన్ కళ్యాణ్, దీక్ష చేస్తానంటూ..

|
Google Oneindia TeluguNews

కర్నూలు: దిశ ఘటన నేపథ్యంలో బలమైన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్.. కర్నూలు ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడరు? అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బుధవారం కర్నూలులో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

'సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు ఈ జుడీషియల్ క్యాపిటల్ ఎందుకు?’'సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు ఈ జుడీషియల్ క్యాపిటల్ ఎందుకు?’

జగన్.. ప్రీతి కేసుపై ఎందుకు స్పందించడం లేదు?

జగన్.. ప్రీతి కేసుపై ఎందుకు స్పందించడం లేదు?

గత ప్రభుత్వం చేసిన తప్పులకు రివర్స్ టెండరింగ్ అంటున్న జగన్ ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో న్యాయం జరగని సుగాలి ప్రీతి కేసుపై ఎందుకు స్పందించడం లేదని పవన్ కళ్యాన్ ప్రశ్నించారు. ప్రీతికి న్యాయం జరిగితే తాను రోడ్లపైకి రావాల్సిన పని ఉండదని అన్నారు. కర్నూలులో బలమైన నాయకులు ఉన్నా.. ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అన్యాయాన్ని అందరూ ఖండించాలన్నారు.

ప్రీతికి న్యాయం చేయండి..

ప్రీతికి న్యాయం చేయండి..

రాష్ట్ర ప్రభుత్వానికి కర్నూలు నడిబొడ్డున ఉండి.. సీమ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా.. సుగాలి ప్రీతి విషయంలో న్యాయం చేయండి. లేదంటే మీకు చిత్తశుద్ధి లేదని అనుకోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయాన్ని తాను మానవ హక్కుల సంఘం వరకు తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ మరోసారి వ్యాఖ్యానించారు. డీజీపీకి కూడా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
సీబీఐకి ఈ కేసును అప్పగించాలని మరోసారి డిమాండ్ చేశారు.

మరోసారి వస్తా.. దీక్ష చేస్తా..

మరోసారి వస్తా.. దీక్ష చేస్తా..

సుగాలి ప్రీతికి న్యాయం జరగకపోతే మరోసారి వచ్చి ఒకరోజు దీక్ష చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అప్పుడు కూడా వినకపోతే పరిస్థితులు ఎవరి చేతుల్లో ఉండవని హెచ్చరించారు. జగన్ రెడ్డికి చెబుతున్నా.. కర్నూలులో కూడా దిశ పోలీస్ స్టేషన్ పెట్టండి. మైనార్టీ తీరని వారిపైనే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.
సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు ఎన్ని చట్టాలు తెచ్చి ఏం లాభమని ప్రశ్నించారు. వైసీపీ సర్కారు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

చేతులు జోడించి చెబుతున్నా..

చేతులు జోడించి చెబుతున్నా..

కడుపు మండుతున్నా.. నియంత్రణతోనే మాట్లాడుతున్నానని చెప్పారు. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలన్నారు. తన కూతురు కేసును తనే వాదించుకునే పరిస్థితిలోకి సుగాలి ప్రీతి తల్లి పార్వతి వెళ్లిపోయిందన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్‌లో అమ్మాయిలకు ఇబ్బందికర పరిస్థితులున్నాయన్నారు. దీనిపై విచారణ జరపాలన్నారు. సర్కారు మేల్కోవాలి.. డీజీపీ చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని రెండు చేతులు జోడించి చెబుతున్నానని తెలిపారు.

English summary
pawan kalyan demands justice for sugali preethi: hits out at cm jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X