కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు ఈ జుడీషియల్ క్యాపిటల్ ఎందుకు?’

|
Google Oneindia TeluguNews

కర్నూలు: బలహీనులకు అండగా నిలబడేందుకే తాను జనసేన పార్టీని స్థాపించినట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. చట్టం బలవంతులకు బలహీనంగా.. బలహీనులపై బలంగా పనిచేస్తోందని అన్నారు. ఈ పద్ధతి మారాలన్నారు. సుగాలి ప్రీతి హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కర్నూలులో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.

సుగాలి ప్రీతి హత్యాచారోదంతం ఇలా: 'యూ చీప్ పీపుల్’ అంటూ మంత్రి అనిల్, జగన్‌కు గుర్తురాలేదు’సుగాలి ప్రీతి హత్యాచారోదంతం ఇలా: 'యూ చీప్ పీపుల్’ అంటూ మంత్రి అనిల్, జగన్‌కు గుర్తురాలేదు’

అత్యాచారం జరిగిందని పోస్టుమార్టం రిపోర్టులు చెప్పినా..

అత్యాచారం జరిగిందని పోస్టుమార్టం రిపోర్టులు చెప్పినా..

సుగాలి ప్రీతిపై అత్యాచారం జరిగిందని పోస్టుమార్టం నివేదికలు తేల్చినా ఎవరూ పట్టించుకోలేదని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పోలీసు శాఖను తప్పుబట్టడం లేదని.. రాజకీయ నాయకులనే తప్పుబడుతున్నానని అన్నారు. పోలీసు అధికారి కొడుకుగా చెబుతున్నా.. పోలీసులకు న్ాయయం చేయాలని ఉన్నా రాజకీయ బాసుల ఒత్తిడిలతో ఆగిపోతున్నారని పవన్ అన్నారు.

పాఠశాలలో దారుణం జరిగితే..

పాఠశాలలో దారుణం జరిగితే..


మంగళిగిరి ఆఫీసుకు వచ్చి సుగాలి ప్రీతి తల్లి ఈ దారుణంపై చెప్పారని.. సినిమాల్లో రెండు గంటల్లో న్యాయం చేయవచ్చు కానీ.. ఇక్కడ ఎలా న్యాయం చేయాలో అర్థం కాలేదని అన్నారు. కళ్లకు నీళ్లు వచ్చాయని అన్నారు. అందుకే కర్నూలు యువత, ప్రజలు ప్రీతి కుటుంబానికి అండగా ఉంటారనే తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు.
హైదరాబాద్ దిశ ఘటనలో రోడ్డు పక్కన జరిగింది కానీ.. ఈ ఘటన మాత్రం పాఠశాలలోనే జరిగిందని పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థినులను వస్తువులుగా వాడుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నారు. ఈ నిందితులను కఠినంగా శిక్షించకపోతే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయన్నారు.

మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తాం..

మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తాం..


దిశ ఘటనలో ఎలా న్యాయం చేశారో.. ఇక్కడ కూడా అలాగే న్యాయం చేయాలన్నారు. అయితే, తాను ఎన్‌కౌంటర్లు చేయమనడం లేదని.. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. పాఠశాలలో అత్యాచారం జరిగితే.. నిందితులకు రాజకీయ నాయకులు అండగా ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు అధికారికంగా అప్పగించకపోతే.. తాను మానవ హక్కుల సంఘానికి ఈ ఘటనను తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

ప్రీతికి న్యాయం చేయని జుడీషియల్ క్యాపిటల్ ఎందుకు?

ప్రీతికి న్యాయం చేయని జుడీషియల్ క్యాపిటల్ ఎందుకు?

సుగాలి ప్రీతి కుటుంబం షెడ్యూల్ ట్రైబ్స్ నుంచి వచ్చిన వారని, వారు నిస్సాహయతతో ఉన్నారని.. అందుకే వారికి అండగా నిలబడుతున్నానని చెప్పారు పవన్. వైసీపీ రాష్ట్ర మంత్రివర్గం కర్నూలును జూడీషియల్ క్యాపిటలర్ అంటున్నారని.. సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు దీని ప్రయోజనం ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రేప్, హత్య జరిగిందని ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని.. చివరకు సీఎం జగన్ కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

English summary
Janasena president pawan kalyan fires at ys jagan govt for sugali preethi case issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X