కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రం దిగొచ్చేలా పవన్ కల్యాణ్ ప్లాన్.. జగన్ సర్కారుకు స్ట్రాంగ్ వార్నింగ్.. పవర్ అంటే అదే..

|
Google Oneindia TeluguNews

''చిన్నప్పుడు నేను చీరాలలో పెరిగాను. మా ఇంటిపక్కనే చేనేత కుటుంబాలు ఉండేవి . మగ్గం నేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. అంత కష్టపడినా కూడుకు, గుడ్డకు లేక నేతన్నలు విలవిలలాడటం నాకు తెలుసు. చేనేత కుటుంబాకుల చెందినవాళ్లు నాకు స్నేహితులుగా ఉండేవాళ్లు. స్కూల్ ఫీజులు కట్టలేక వాళ్లు పడిన ఇబ్బందులన్నీ చూశాను. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు లేవు. నేతన్నల కష్టాలు వెంటనే తీర్చేస్తానని హామీలివ్వలేను. కానీ మీ కష్టాలకు భుజం కాస్తా. సమస్యల పరిష్కారానికి కేంద్రమే దిగొచ్చేలా మీ తరఫున పోరాడుతా. మిగతా నాయకుల్లాగా మాటలు చెప్పి తప్పించుకునేవాణ్నికాను. భవిష్యత్తులో మీ బిడ్డలకు కష్టాలు రాకుండా చూసుకునే అవకాశం దక్కితే అంతే చాలు'' అంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు.

ఏ ముస్లింనూ భారత్ నుంచి విడదీయలేరు: సీఏఏపై పవన్ కళ్యాణ్, చరిత్ర చెప్పారు..ఏ ముస్లింనూ భారత్ నుంచి విడదీయలేరు: సీఏఏపై పవన్ కళ్యాణ్, చరిత్ర చెప్పారు..

ఎమ్మిగనూరులో..

ఎమ్మిగనూరులో..


రెండ్రోజుల పర్యటన కోసం కర్నూలు జిల్లాకు వచ్చిన జనసేనాని గురువారం ఎమ్మిగనూరులో చేనేత కార్మికులతో భేటీ అయ్యారు. వందలాది మంది నేతలన్నలు పవన్ తో తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సమస్యలపై పోరాటానికి పవన్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. జనసేనతో కలిసి బీజేపీ కూడా పనిచేస్తోంది కాబట్టి కేంద్రం ద్వారా పరిష్కారాలు రాబట్టుకుందామన్నారు. పవన్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే...

ముందుగా జేఏసీ..

ముందుగా జేఏసీ..

‘‘అన్నం పెట్టే రైతులు.. బట్టలిచ్చే నేతన్నలు పడుతున్న కష్టాలు ఒక్క రోజులో తీరిపోయేవికావు. కానీ వాటికోసం నేను కృషి చేస్తాను. ఏపీ నేతన్నల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి ముందు.. మగ్గం నేస్తోన్న కార్మికులు, మగ్గం కారణంగా కళ్లూ, ఒళ్లు గుల్ల అయిపోయినవాళ్లు, సమస్యతో సంబంధమున్న ప్రతి ఒక్కరిని కలుపుకొని జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయిస్తాను. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాను. రెండు మూడు వారాల్లోనే ఈ పనిచేసి, సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలు, వాటి రికార్డులను తీసకుని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళదాం. నేతన్నల సమస్యలపై కేంద్రం దిగొచ్చేలా కలిసి పోరాడుదాం.

అసలు సమస్యే అది..

అసలు సమస్యే అది..

చేనేత కార్మికులే కాదు.. రాష్ట్రంలో రకరకాలుగా బాధలు పడుతున్నవాళ్లందరూ ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అసలు సమస్య ఎక్కడుందంటే.. కష్టాలు తగ్గాలి, జీవితాలు మారాలని కోరుకునేవాళ్లంతా.. ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునే విషయంలో అనాలోచితంగా వ్యవహరిస్తున్నారు. ఓటేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ఎన్నికల సమయంలో ప్రలోభాలకో, బెదిరింపులకో లొంగిపోయి ఓట్లేస్తే.. గెలిచిన పార్టీ తర్వాతి కాలంలో జనాన్ని వదిలేస్తుంది.

సీఎం జగన్ పై ఫైర్..

సీఎం జగన్ పై ఫైర్..


మొన్నటి ఎన్నికల్లో మీరే చూశారు.. టెక్స్ టైల్ పార్కులు పెడతాం, వేల మంది నేతన్నలకు ఉద్యోగాలిస్తాం, 45 ఏళ్లకే పెన్షన్లు ఇస్తాం అని మాయమాటలు చెప్పిన జగన్.. గద్దెనెక్కిన తర్వాత అన్నీ మర్చిపోయారు. పెన్షనర్ల వయసు కుదిస్తామని చెప్పి.. చాలా మందికి అసలు పెన్షన్లు రాకుండా చేస్తున్నారు. పిల్లలు ఉద్యోగస్తులైతే పెన్షన్లు ఇవ్వబోమని వైసీపీ ప్రభుత్వం చెప్పడం చాలా దారుణం. ఎందుకంటే ఉద్యోగాలు చేసేవాళ్లందరూ తమ తల్లిదండ్రుల్ని చూసుకుంటారని గ్యారంటీగా చెప్పలేం. ఈ విషయంలో జగన్ సర్కారుపై జనసేన కచ్చితంగా పోరాడుతుంది''అని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

పవర్ గురించి పవర్ స్టార్..

పవర్ గురించి పవర్ స్టార్..

సినిమాల్లో పవర్ స్టార్ గా గుర్తింపు పొందిన పవన్ కల్యాణ్.. పొలిటికల్ పవర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయినా తాను ఇంకా ప్రజల్లోనే ఎందుకు తిరుగుతున్నానో అర్థం చేసుకోవాలని ఆయన వేడుకున్నారు. జనం కష్టాలు, కన్నీళ్లలో అండగా ఉండటానికే జనసేన పార్టీని స్థాపించానని చెప్పారు. వెంటనే అధికారంలోకి రావడం తన టార్గెట్ కానేకాదన్నారు. పవర్ అంటే నిజమైన అర్థం ప్రజల కష్టాలు తీర్చేదేనని, తన చేతుల్లో పవర్ ఉంటే అందరి కష్టాలు తీర్చేవాడినని పవన్ కల్యాణ్ చెప్పారు.

English summary
jana sena chief pawan kalyan second day tour in kurnool district. he Interacted with Weavers in Yemmiganur on thursday. pawan promised to take up the Weavers issues to central govt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X