కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూమా అఖిలప్రియ సంచలనం: 3 రాజధానులతో సీమకే నష్టం, కానీ కర్నూలును..

|
Google Oneindia TeluguNews

మూడు రాజధానులపై మాజీమంత్రి భూమా అఖిలప్రియ మరోసారి నోరువిప్పారు. రాజధానులతో ఎక్కువ నష్టపోయేది రాయలసీమ వారేనని పేర్కొన్నారు. ఇటీవలే మూడు రాజధానులపై అఖిలప్రియ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు కర్నూలును న్యాయ రాజధాని వద్దు అని.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మారిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. కానీ ఇంతలోనే స్వరం మార్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. కర్నూలును జ్యుడిషీయరీ క్యాపిటల్‌ చేస్తే ఓకే కానీ.. విజయవాడ, విశాఖలో బెంచ్‌లు ఎందుకు అని ప్రశ్నించారు.

భూమా అఖిలప్రియ కొత్త ఇన్నింగ్స్.. సినీ రంగంలోకి మాజీ మంత్రి.. ఏవీతో వివాదాల తర్వాత..భూమా అఖిలప్రియ కొత్త ఇన్నింగ్స్.. సినీ రంగంలోకి మాజీ మంత్రి.. ఏవీతో వివాదాల తర్వాత..

కర్నూలుకు ప్రాధాన్యం ఏదీ..?

కర్నూలుకు ప్రాధాన్యం ఏదీ..?

జ్యూడిషీయల్ క్యాపిటల్ కర్నూలు అని చెబితే ఓకే అని అఖిలప్రియ అన్నారు. కానీ విశాఖ, విజయవాడలో హైకోర్టు బెంచ్ ఇవ్వడం సరికాదన్నారు. అలా అయితే తమ కర్నూలుకు ఏం ప్రాధాన్యం ఉంటుందని ప్రశ్నించారు. ఇలా అయితే రాయలసీమలో గల కర్నూలు ఎలా జ్యుడిషీయల్ క్యాపిటల్ అవుతోందని ప్రశ్నించారు. ఇదీ రాయలసీమ ప్రాంత ప్రజలను మోసం చేయడమే అవుతోందన్నారు. మరొటి కాదని తేల్చిచెప్పారు.

విశాఖ, విజయవాడలో బెంచ్‌లు వద్దు..

విశాఖ, విజయవాడలో బెంచ్‌లు వద్దు..

కర్నూలుకే హైకోర్టు ఇస్తామని చెబితే స్వాగతిస్తామని అఖిలప్రియ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా వెల్ కం చేస్తామని గుర్తుచేశారు. కానీ హైకోర్టుతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎయిర్‌పోర్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి రాయలసీమలో ఉన్న విద్య సంఘాలు, రైతు సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆమె కోరారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయం గురించి సీమలో ఉన్న ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు నోరు విప్పాలని హితవు పలికారు.

Recommended Video

Lockdown : APSRTC Services Are Ready,Ticket Charges Are Likely To High
 టీడీపీ అలా.. భూమా ఇలా..

టీడీపీ అలా.. భూమా ఇలా..

రాజధాని తరలింపుపై టీడీపీ గగ్గోలు పెడుతోంది. అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీని రద్దు చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. మరో అడుగు ముందుకేసి 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని కూడా ప్రకటించారు. కానీ టీడీపీ నేత భూమా అఖిలప్రియ మాత్రం రాయలసీమ గురించి పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. కర్నూలును జ్యుడిషీయరీ క్యాపిటల్ చేయాలని.. విజయవాడ, విశాఖలో బెంచ్ వద్దని చెప్పడం టీడీపీ స్టాండ్ కానే కాదు. మరీ దీనిపై ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలీ.

English summary
rayalaseema loss three capitals ex minister bhuma akhilapriya said. kurnool want full judiciary capital, dont want vijawada, vizag benchs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X