కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరమీదకు దేశ రెండో రాజధాని అంశం .. జగన్ క్లారిటీ ఇవాలన్న ఎంపీ టీజీ వెంకటేష్

|
Google Oneindia TeluguNews

దేశానికి రెండవ రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దక్షిణ భారత దేశానికి రెండో రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది . చాలా సంవత్సరాలుగా ఏపీకి రెండో రాజధానిగా కర్నూలు చెయ్యాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది . టీజీ వెంకటేష్ ఆ వాదనను బలంగా వినిపించారు . రాయలసీమలోని కర్నూల్ ని దేశానికి రెండవ రాజధాని చెయ్యాలని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. దేశానికి రెండవ రాజధాని అవసరం ఉందన్న ఆయన.. కర్నూల్ ని క్యాపిటల్ గా అనౌన్స్ చెయ్యాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

మహిళలను బెదిరించటానికి భర్తల అరెస్ట్ .. మోసం, వేధింపులే జగన్ పాలన ... చంద్రబాబు సీరియస్మహిళలను బెదిరించటానికి భర్తల అరెస్ట్ .. మోసం, వేధింపులే జగన్ పాలన ... చంద్రబాబు సీరియస్

ఇక ప్రధాని మోదీ ..70ఏళ్ల కశ్మీర్‌ సమస్యను పరిష్కరించారని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ ప్రసంశల వర్షం కురిపించారు . ఆర్టికల్‌ 370 రద్దు చరిత్రాత్మక నిర్ణయమన్నారు ఎంపీ టీజీ వెంకటేష్ . కేంద్రంతో ఏపీ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్న ఆయన ఏపీ సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనపై స్పందించారు. జగన్ ఢిల్లీ పర్యటనను స్వాగతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీతో రాష్ట్ర ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్న ఆయన బీజేపీతో సఖ్యత అవసరం అన్న ధోరణిలో మాట్లాడారు.

Second capital of the country topic .. Jagan has to give Clarity ... MP TG Venkatesh

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై జగన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు టీజీ వెంకటేష్ . అసలు జగన్ రాజధానిగా అమరావతిని ఆమోదిస్తున్నారో లేదో చెప్పాలన్నారు. జగన్ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వంగా మారిందని టీజీ వెంకటేష్ విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పధకాలను , అభివృద్ధి పనుల కాంట్రాక్ట్ లను రద్దు చేస్తూ జగన్ సర్కార్ రద్దుల సర్కార్ గా తయారైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలే టీడీపీ నుండి రాజ్య సభ సభ్యుడిగా ఉన్న టీజీ వెంకటేష్ పార్టీ ఫిరాయించి బీజేపీ లో చేరారు.

English summary
BJP leader and Rajya Sabha MP TG Venkatesh demanded that Kurnool in Rayalaseema be made the second capital of the country. BJP MP TG Venkatesh said that Modi has solved the 70-year-old Kashmir issue. Historical decision of cancellation of Article 370 said MP TG Venkatesh. He was responding to a two-day visit to Delhi by AP CM Jagan that the AP's interests are linked to the Center. He spoke of the tendency to be aligned with the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X