కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదం: కుడిగట్టు ప్లాంట్ భద్రతపై ప్రశ్నలు, ఇంజినీర్లు మాత్రం..

|
Google Oneindia TeluguNews

శ్రీశైలం ఎడమగట్టున గల పవర్ ప్లాంట్ ప్రమాదంతో 9 మంది చనిపోయారు. దీంతో కుడిగట్టున గల పవర్ ప్లాంట్ భద్రతపై ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే కుడిగట్టు సేఫ్ అని ఇంజినీర్లు చెబుతున్నారు. ఎడమగట్టు భూగర్భంలో ఉండగా.. కుడిగట్టు ఉపరితలంపై ఉండటమే అని వివరిస్తున్నారు. గతంలో ప్రమాదం జరిగినా, నీట మునిగినా ప్రాణనష్టం మాత్రం సంభవించలేదు అని చెబుతున్నారు.

శ్రీశైలం విద్యుత్ కేంద్ర ప్రమాదంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ప్రమాదమా..? కుట్ర అంటూ కామెంట్స్శ్రీశైలం విద్యుత్ కేంద్ర ప్రమాదంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ప్రమాదమా..? కుట్ర అంటూ కామెంట్స్

కుడివైపు ప్లాంట్ భద్రతపై ప్రశ్నలు

కుడివైపు ప్లాంట్ భద్రతపై ప్రశ్నలు

శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టున తెలంగాణ విద్యుదుత్పత్తి ప్లాంటు ఉంది. కుడివైపున గల ప్లాంటు ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోకి వస్తుంది. ఎడమ గట్టు పవర్ ప్లాంట్ 20 ఏళ్ల కింద నిర్మించారు. కానీ కుడిగట్టు కేంద్రాన్ని 40 ఏళ్ల కింద ఏర్పాటు చేశారు. ఈ రెండు పవర్ ప్లాంట్ సాగు నీరు అందించేందుకు దోహపదపడుతున్నాయి. జల విద్యుత్ ఉత్పత్తి కూడా సృష్టిస్తున్నారు.

భారీ ప్రమాదం..

భారీ ప్రమాదం..

గురువారం రాత్రి జరిగినా ప్రమాదం శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ జరగలేదు. దీంతో కుడిగట్టు భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎడమ గట్టు ప్రాజెక్టుతో పోల్చితే కుడిగట్టు కేంద్రం భద్రమైనదని ఇంజనీర్లు తెలిపారు. ఎడమగట్టు ప్లాంటు భూగర్భంలో రెండు కిలోమీటర్ల లోతులో టర్బైన్లు ఉన్నాయి కుడిగట్టు మాత్రం ఉపరితలంలో ఉంది. టర్బైన్లు 150 అడుగులలో ఉన్నాయి. ఎడమగట్టు ప్లాంటు ప్రమాదంలో జీరో లెవల్‌లో మంటలు ప్రారంభమై.. పైన గల సర్వీస్‌ డే వరకు దట్టమైన పొగ అలుముకుంది. కింది నుంచి పైకి మంటలు, పొగ వేగంగా వ్యాపించింది. దీంతో అందులో ఉన్న ఉద్యోగులు/ సిబ్బంది వేగంగా రాలేకపోయారు.

లోపలికి వెళ్లేందుకు వీలుపడని వైనం

లోపలికి వెళ్లేందుకు వీలుపడని వైనం

ప్రమాదాన్ని గుర్తించినా బయట వ్యక్తులు లోపలికి వెళ్లలేకపోయారు. సహాయ చర్యలు కూడా ఆటంకం కలిగింది. అయితే కుడిగట్టు ప్లాంటు ఉపరితలంలో ఉన్నందున ప్రమాదం జరిగినా తీవ్రత ఈ స్థాయిలో ఉండదని ఇంజినీర్లు పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం కుడిగట్టు ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. కానీ వెంటనే వాటిని ఆర్పివేయగలిగారు. భూ ఉపరితలంపై ఉండటమే అని చెబుతున్నారు. స్వదేశీ సాంకేతికత పరిజ్ఞానంతో నిర్మించిన కేంద్రంలో సాంకేతిక సమస్య వస్తే సైరన్ల ద్వారా సంకేతాలు వెలువడతాయి.

Recommended Video

Vijayawada స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ ఆసుపత్రి భద్రతా ప్రమాణాలు పాటించలేదు : Fire Safety Officer
వరదలొచ్చినా.. ఆస్తినష్టమే..

వరదలొచ్చినా.. ఆస్తినష్టమే..


11 ఏళ్ల క్రితం వచ్చిన భారీ వరదలకు కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నీట మునిగింది. శ్రీశైలం డ్యామ్‌ గేట్ల ద్వారా 25 లక్షల క్యూసెక్కులను కిందికి వదిలేయాల్సి వచ్చింది. పవర్‌ హౌస్‌కు ఆనుకొని ఉన్న రక్షణగోడ బద్దలై వరద నీరు లోపలికి చేరింది. అప్పుడు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. కానీ భారీగా ఆస్తినష్టం మాత్రం సంభవించింది.

English summary
srisailam left power plant fire accident after questions raised in srisailam right power plant security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X