కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీశైలం ఆలయ కుంభకోణం కేసు .. ఫేక్ ఐడీలతో అభిషేకం టికెట్ల విక్రయాలు .. 24 మంది అరెస్ట్

|
Google Oneindia TeluguNews

శ్రీశైలం ఆలయంలో భారీ కుంభకోణం జరిగింది. సాక్షాత్తు శ్రీశైలం మల్లన్న ఆలయంలో ముక్కంటి అయిన ఆ పరమశివుడు సాక్షిగా అక్రమార్కులు అవినీతి కార్యకలాపాలు కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీశైలం ఆలయంలో అభిషేకం ,ఆర్జిత సేవల టిక్కెట్ల సేవలలో జరిగిన కుంభకోణంలో పోలీసులు అక్రమార్కుల భరతం పట్టే పనిలో పడ్డారు.

మన రక్తం చల్లబడిపోయింది .. తిరిగి వేడెక్కాలంటే ఆ పని చెయ్యాలి :నాగబాబు మన రక్తం చల్లబడిపోయింది .. తిరిగి వేడెక్కాలంటే ఆ పని చెయ్యాలి :నాగబాబు

అభిషేకం టికెట్ల విక్రయాల్లో అవినీతి .. 24 మంది అరెస్ట్

అభిషేకం టికెట్ల విక్రయాల్లో అవినీతి .. 24 మంది అరెస్ట్

శ్రీశైలం ఆలయంలో జరిగిన భారీ స్కామ్ విషయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన 24 మందిని అరెస్టు చేసినట్లు డిఎస్పి వెంకట్రావు పేర్కొన్నారు .ఫేక్ ఐడి లు క్రియేట్ చేసి వాటి ద్వారా అభిషేకం టిక్కెట్ల విక్రయాలకు పాల్పడినట్లుగా పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ధనార్జనే ధ్యేయంగా రెచ్చిపోయిన అక్రమార్కులు శ్రీశైలం దేవస్థానంలో జోరుగా చేతివాటం చూపించినట్లుగా తాజా దర్యాప్తులో బయటపడింది.ఇక శ్రీశైలం ఆలయంలో జరిగిన కుంభకోణానికి సంబంధించి ఉద్యోగులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో, ఆలయంలో జరుగుతున్న వాటిపై అధికారుల దృష్టి పడింది. ఇప్పుడు తీగ లాగితే డొంకంతా కదులుతుంది.

విరాళాల కౌంటర్ లోనూ చేతివాటం .. రికవరీ చేస్తున్న అధికారగణం

విరాళాల కౌంటర్ లోనూ చేతివాటం .. రికవరీ చేస్తున్న అధికారగణం


ఇప్పటికే భక్తులు దేవస్థానానికి సమర్పించిన విరాళాల కౌంటర్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏకంగా యాభై ఆరు లక్షల రూపాయలు కాజేసినట్టు గుర్తించి దర్యాప్తు చేయడానికి రంగంలోకి దిగిన అధికారులు, ఇక దేవస్థానానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. ఇటీవల శ్రీశైలం దేవస్థానం విరాళాల కౌంటర్లో 56 లక్షలు మాయం చేసిన వారిని పట్టుకున్న అధికారులు, పోలీసులు వారి వద్ద నుండి 42లక్షల రూపాయలు రికవరీ చేశారు.

రూ.2 .12 కోట్ల అవినీతి గుర్తించిన పోలీసులు .. 83. 40లక్షల రూపాయలు, ఒక కారు స్వాధీనం

రూ.2 .12 కోట్ల అవినీతి గుర్తించిన పోలీసులు .. 83. 40లక్షల రూపాయలు, ఒక కారు స్వాధీనం

ఇక తాజాగా ఫేక్ ఐడి లు క్రియేట్ చేసి అభిషేకం టికెట్లను అమ్మిన వారి వద్ద 83. 40లక్షల రూపాయలను, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం అభిషేకం టికెట్ల విక్రయాల స్కామ్ లో 2 .12 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 24 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి మరింత సమాచారం రాబట్టే పనిలో పడ్డారు. అయితే ఈ స్కామ్ లో ఆలయంలో పనిచేసిన దర్శిల్లీ , రూపేష్ అనే వ్యక్తులను ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు అధికారులు. ఇక ఆలయంలో జరిగిన అవినీతిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు .

English summary
The Srisailam Temple scam which has created a statewide sensation, has been investigated by the police over the anointing and proceeds of service tickets. DSP J Venkatrao said 24 persons have been arrested for corruption and irregularities. The total amount of Rs 2.12 crore in the temple has been corrupted the DSP said .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X