• search
 • Live TV
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్‌ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు: ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చిన సీఎం

|
  3 Minutes 10 Headlines | Yuvraj Singh In Web Series | Donald Trump Temple In TS | Oneindia Telugu

  కర్నూలు: అనుమానాస్పద స్థితిలో కన్నుమూసిన పదవ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వైఎస్ జగన్ కర్నూలుకు వచ్చిన సందర్భంగా సుగాలి ప్రీతి తల్లిదండ్రులు సుగాలి రాజు నాయక్, సుగాలి ప్రీతి ఆయనను కలిశారు. తమ కుమార్తె అనుమానాస్పద స్థిలో మరణించిన మూడేళ్లయినప్పటికీ.. తమకు న్యాయం జరగలేదని చెప్పారు.

  Sugali Preethi: పవన్ ర్యాలీకి ఒక్క రోజు ముందు: సుగాలి ప్రీతి కేసు సీబీఐకి: త్వరలో ఆ రెండు కూడా.. !

   బహిరంగ సభ ముగిసిన వెంటనే..

  బహిరంగ సభ ముగిసిన వెంటనే..

  కర్నూలు ఎస్టీబీసీ కళాశాలలో బహిరంగ ముగిసిన వెంటనే స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.. రాజు నాయక్, సుగాలి పార్వతి వచ్చిన విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనితో ఆయన వారు ఎక్కడ ఉన్నారని ఆరా తీశారు. వేదిక దిగి నేరుగా రాజు నాయక్, పార్వతిల వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా సుగాలి పార్వతి భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. 2017 ఆగస్టులో తమ కుమార్తె సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించిందని గుర్తు చేశారు.

  ఆరా తీసిన వైఎస్ జగన్..

  ఆరా తీసిన వైఎస్ జగన్..

  తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంతటి బలహీన మనస్కురాలు కాదని అన్నారు. ఆమెపై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడి ఉంటారని చెప్పారు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారని అన్నారు. ప్రీతి మృతదేహంపై గాయాలు ఉన్నాయని వెల్లడించారు. అనంతరం ఆయనకు ఓ వినతిపత్రాన్ని అందజేశారు. రాజు నాయక్, పార్వతి వెల్లడించిన అంశాలన్నింటినీ విన్న తరువాత.. కొన్ని విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ఏ దశలో ఉందనే విషయంపై ఆరా తీశారు.

  సమగ్ర నివేదిక ముఖ్యమంత్రి కార్యాలయానికి..

  సమగ్ర నివేదిక ముఖ్యమంత్రి కార్యాలయానికి..

  ఈ ఘటనపై మరోసారి సమగ్ర దర్యాప్తు చేయాలని వైఎస్ జగన్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ కే ఫకీరప్పను ఆదేశించినట్లు తెలుస్తోంది. తొలుత ఓ నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాలని సూచించినట్లు చెబుతున్నారు. ఈ కేసు ఏ దశలో ఉంది? దర్యాప్తు ఎందుకు నెమ్మదించింది? రాజకీయ ప్రమేయం ఏదైనా ఉందా? అనే అంశాలపై వైఎస్ జగన్ స్థానిక నాయకులు, ఎస్పీని అడిగి తెలుసుకున్నారని సమాచారం.

  అత్యాచారం.. ఆపై హత్యగా అనుమానాలు..

  అత్యాచారం.. ఆపై హత్యగా అనుమానాలు..

  2017లో సుగాలి ప్రీతి మరణించిన విషయం తెలిసిందే. కర్నూలు లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న రాజు నాయక్, పార్వతి దంపతుల కుమార్తె ఆమె. దిన్నెదేవరపాడు సమీపంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని. ఈ రెసిడెన్షియల్ పాఠశాాల తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడిదనే ఆరోపణలు ఉన్నాయి. 2017 ఆగస్టు 19వ తేదీన సుగాలి ప్రీతి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో నిర్జీవంగా కనిపించారు.

   న్యాయం కోసం ఉద్యమిస్తోన్న జనసేన..

  న్యాయం కోసం ఉద్యమిస్తోన్న జనసేన..

  సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్యమిస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా పవన్ కల్యాణ్ ఈ కేసు కోసం పోరాడుతున్నారు. పలుమార్లు దీనిపై ఆయన బహిరంగ ప్రకటనలు చేశారు. ఈ నెల 12వ తేదీన కర్నూలులో పవన్ కల్యాణ్ ఓ భారీ ర్యాలీని కూడా నిర్వహించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. తాజాగా వైఎస్ జగన్ దృష్టికి వెళ్లింది ఈ కేసు. తరువాతి పరిణామాలు ఎలా ఉంటాయనే విషయం చర్చనీయాంశమౌతోంది.

  English summary
  Parents of Sugali Preethi who Alleging sexual abuse and murder of SSC student in Cattamanchi Ramalinga Reddy High School hostel, on the outskirts of Kurnool city, meets Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy at Kurnool. Sugali Preethi mother Sugali Parvathi claimed on Monday that her body bore wounds on her legs and hands but the school management was projecting it as a suicide.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X