కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్కడ దిగొచ్చిన టమాట.. కిలో రూ.10 నుంచి రూ.27.. ఎక్కడ అంటే

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు మార్కెట్‌లో ఉల్లిగడ్డ, టమాట ధరలకు రెక్కలు వచ్చాయి. భారీగా ధర పలకడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇక టమాట గురించి అయితే రకరకాల మీమ్స్ కూడా వస్తున్నాయి. కిలో టమాట ధర రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో గల కర్నూలులో మాత్రం తక్కువ ధర పలుకుతుంది. తక్కువ అంటే.. రెగ్యులర్ ధరకే లభిస్తోంది.

నిన్న మొన్నటి వరకు వంద రూపాయలకు పైగా ధర పలికిన టమోటా ఒక్కసారిగా పడిపోయింది. కర్నూలు జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో శనివారం టమోటా ధర గరిష్టంగా రూ. 27 పలకగా, కనిష్టంగా రూ. 10 పలికింది. ఒక్కసారిగా టమోటా ధరలు భారీగా తగ్గడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇదీ మిరాకిల్ అని చెప్పొచ్చు. రూ.100 నుంచి రూ.27 అంటే తక్కువేగా మరి.

tamato rate cheap in kurnool pattikonda

వినియోగదారుల వెర్షన్ ఇలా ఉంటే.. రైతులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ధరలకు రవాణా ఖర్చులు కూడా రావడం కష్టమేనని చెబుతున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి టమోటా దిగుమతి కావడం వల్ల ధరలు తగ్గాయని పత్తికొండ వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలోని పలు మార్కెట్లలో టమోటా ధర రూ. 50కిపైగా పలుకుతోంది. కానీ పత్తికొండ మార్కెట్ యార్డులో ఊహించని విధంగా ధరలు తగ్గడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యాపారులు పత్తికొండలో ధరలు తగ్గించి ఇతర ప్రాంతాల్లో అధిక రేట్లకు అమ్ముకునేందుకు పన్నాగం పన్నినట్లు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి నిజనిజాలు తెలియాల్సి ఉంది. కానీ ధర మాత్రం తక్కువగానే ఉండటంతో.. వినియోగదారులు మాత్రం నమ్మలేకపోతున్నారు. అవునా అని ముక్కున వేలేసుకుంటున్నారు.

టమాట ధరకు సంబంధించి గ్రాములు, తరుగు అని కూడా మిమ్స్ వస్తున్నాయి. కానీ కర్నూలు పత్తికొండ మార్కెట్‌లో మాత్రం ధరలు అమాంతం దిగి వచ్చాయి. మిగతా చోట్ల ఆశ్చర్య పడుతున్నారు. ఇదేంటి ఇంత తక్కువ ఎలా అని సందేహాం వ్యక్తం చేస్తున్నారు.

English summary
tamato rate cheaper in kurnool district pattikonda market. kg tamato is rs.10 to rs.27 in the market
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X