కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాయలసీమ యూనివర్శిటిలో ఉద్రిక్తత.. విద్యార్థుల అరెస్ట్

|
Google Oneindia TeluguNews

రాయల సీమ యూనివర్శిటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాయలసీమలో రాజధానితో పాటు హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ... శుక్రవారం సీఎం జగన్ ఇంటిని ముట్టండించాలని యూనివర్శీటీ విద్యార్థులు పిలుపు ఇవ్వడంతో పెద్ద ఎత్తున పోలీసులు యూనివర్శిటీలో మోహరించారు.

ఈ నేపథ్యంలోనే సుమారు వందమంది విద్యార్థులను ముందస్తు చర్యగా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే యూనివర్శీటిలో టెన్షన్ వాతవరణం నెలకొంది.రాయలసీమలో రాజధాని, కర్నూలు జిల్లాలో హైకోర్టును ఏర్పాటు చేయడంతో పాటు రాయలసీమ అభివృద్దికి విద్యార్థి, యువజన సంఘాలు గత కొద్ది రోజులుగా చేస్తున్న ఆందోళనలు మరింత ఉదృతం అయ్యాయి. ఇప్పటికే పలు విద్యాసంస్థల బంద్‌తో పాటు పలు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Tension at Rayalaseema University

ముఖ్యంగా రాజకీయా నాయకులను అడ్డుకోవడంతో పాటు మానవహారాలు, విద్యార్థుల ఆందోళనలతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం సీఎం జగన్ ఇంటిని ముట్టడించాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందస్తు చర్యలు దిగారు. ఎలాంటీ ఉద్రిక్తలు నెలకొనకుండా విద్యార్థుల అరెస్ట్‌లను కొనసాగిస్తున్నారు.

English summary
Tension at the University of Rayalaseema, large number of police were deployed at the university because of calling cm jagan house Obsession.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X