కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరుసగా రెండో ఏడాది: శ్రీశైలం ఫుల్: వేల క్యూసెక్కులు దిగువకు: హారతి పట్టిన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

శ్రీశైలం: వరుసగా రెండో సంవత్సరం శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని అందుకుంది. వరద నీటితో పోటెత్తుతోంది. ఇన్‌ఫ్లో తగ్గకపోవడంతో.. జల వనరుల శాఖ అధికారులు రిజర్వాయర్ మూడు గేట్లను ఎత్తారు. వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో తీవ్రతను బట్టి గురువారం సాయంత్రానికి మరో రెండు గేట్లను ఎత్తే అవకాశం ఉంది. బుధవారం సాయంత్రానికి రిజర్వాయర్‌లోకి 3.69 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. నీటి నిల్వ 881.30 అడుగులకు చేరుకుంది.

71 వేల క్యూసెక్కులకు పైగా..

71 వేల క్యూసెక్కులకు పైగా..


దీనితో అధికారులు మూడు గేట్లను ఎత్తారు. వరద నీటిని దిగువకు వదిలారు. 71,321 క్యూసెక్కుల మేర నీటిని వదులుతున్నారు. శ్రీశైలం వరద జలాల ప్రభావంతో పులిచింతల, నాాగార్జున సాగర్ జలకళను సంతరించుకుంటున్నాయి. నాగార్జున సాగర్ క్రమంగా నిండుతోంది. గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకుంటోంది. వరద నీరు పోటెత్తడం కొనసాగితే.. మరి కొన్ని గంటల్లో నాగార్జున సాగర్ గేట్లను కూడా ఎత్తే అవకాశాలు లేకపోలేదు.

కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో వరదపోటు..

కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో వరదపోటు..

కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణల్లో భారీ వర్షాలు కురిశాయి. అటు తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఈ రెండు నదులు పొంగిపొర్లుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో వరద తాకిడి అంచనాలకు మించిన స్థాయిలో ఏర్పడింది. పలు గ్రామాలు మునకేశాయి. కర్ణాటకలో కృష్ణానదిపై నిర్మించిన ఆలమట్టి సహా నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు.

 నాగార్జున సాగర్ గేట్లనూ..

నాగార్జున సాగర్ గేట్లనూ..

ఆ వరద నీరంతా తెలంగాణలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు కూడా గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరకోవడంతో నీటిని దిగువకు వదిలారు. ఆ వరద నీరంతా శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో వరద నీటిని దిగువకు వదిలి వేస్తున్నారు. దీని ప్రభావంతో పులిచింతల, నాగార్జున సాగర్‌ క్రమంగా నిండుతున్నాయి. నాగార్జున సాగర్ ఇన్‌ఫ్లో అధికంగా ఉంటోంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఆ రిజర్వాయర్ గేట్లను కూడా ఎత్తేస్తామని అధికారులు తెలిపారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌తో

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌తో

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల లోక్‌సభ సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి శ్రీశైలం రిజర్వాయర్ గేట్లను ఎత్తారు. అనంతరం కృష్ణమ్మకు పూజలు నిర్వహించారు. హారతి పట్టారు. వరుసగా రెండో సంవత్సరం కూడా శ్రీశైలం వంటి భారీ రిజర్వాయర్ నిండటం శుభపరిణామమని అన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, వరద నీటిని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పోతిరెడ్డి పాడు విస్తరణ పనులను ప్రభుత్వం చేపట్టిందని, ఎలాంటి అడ్డంకులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం కొనసాగాలని అన్నారు.

English summary
With Srisailam Reservoir receiving continuous heavy inflows following heavy rains in upper catchment areas in river Krishna, the Srisailam Dam authorities on Wednesday evening released 79,131 cusecs of water to downstream after lifting 3 spillway gates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X