కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళ పేరుతో హీరో వెంకటేష్ ఫొటో!: కర్నూలు ఓటర్‌ లిస్టులో భయంకరమైన పొరపాటు

|
Google Oneindia TeluguNews

కర్నూలు: ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడం సాధారణంగా మారిపోయింది. నమోదు చేసే సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా తరచూ ఓటర్ జాబితాలో తప్పులు కనిపిస్తూనే ఉంటున్నాయి. అలాంటి భయంకరమైన తప్పే కర్నూలు ఓటర్ జాబితాలోనూ చోటు చేసుకుంది.

కర్నూలు ఓటర్ లిస్టులో వెంకటేష్ ఫొటో..

కర్నూలు ఓటర్ లిస్టులో వెంకటేష్ ఫొటో..

కర్నూలు నగర పాలక సంస్థ విడుదల చేసిన ఓటర్ జాబితాలో టాలీవుడ్ హీరో వెంకటేష్ ఫొటో ఉండటం గమనార్హం. కర్నూలులోని 31వ వార్డులో ఓటరు పేరు రాణి కూమరొలూ అని ఉంది. తండ్రి/భర్త పేరు బాబు కూమరొలూ. ఇంటి నెంబర్ 83/54ఏ. వయసు 20 సంవత్సరాలు. లింగమ్మ: స్త్రీ అని రాసివుంది. అయితే, పక్కనే ఫొటో మాత్రం వెంకటేష్ ఫొటో ఉంది. నెంబర్ ZGF3524139.

తప్పులు సరిచేస్తామంటూ అధికారులు

తప్పులు సరిచేస్తామంటూ అధికారులు

ఓటర్ లిస్టులో ఫొటోలు అప్‌లోడ్ చేసే సమయంలో జరిగిన పొరపాటు వల్ల ఇలాంటి తప్పులు దొర్లుతుండటం గమనార్హం. ఇలాంటి తప్పులు చాలానే ఉన్నాయని ఓటర్లు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం ఎన్నికల సమయానికి అన్ని తప్పులను సరిచేస్తామని చెబుతున్నారు.

హైదరాబాద్‌లోనే వెంకటేష్‌కు ఓటు హక్కు..

హైదరాబాద్‌లోనే వెంకటేష్‌కు ఓటు హక్కు..

కాగా, హీరో వెంకటేష్ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన తెలంగాణలోనే ఓటర్‌గా ఉన్నారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇటీవల తెలంగాణలో మూడేళ్ల చిన్నారికి ఓటు..

ఇటీవల తెలంగాణలో మూడేళ్ల చిన్నారికి ఓటు..

ఇటీవల తెలంగాణలోనూ ఇలాంటి ఓ విచిత్రమైన ఫొటో ఒకటి వెలుగులోకి వచ్చింది. కరీంనగర్‌లో ఇటీవల మూడేళ్ల చిన్నారి ఫొటో ఓటర్ లిస్టులో వచ్చింది. నందిత అనే చిన్నారి ఫొటోను ముద్రించి.. వయసు మాత్రం 35ఏళ్లు అని రాశారు. పేరు, ఫొటో కరెక్టుగానే కానీ, వయసు మాత్రం 35 అని రాశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం 18ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. వారికే ఓటర్ కార్డులు వస్తాయి కానీ, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇలాంటి తప్పిదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.

English summary
tollywood hero venkatesh photo misplaced in kurnool voters list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X