కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలు కమీషనర్ రవీంద్రబాబు పై బదిలీ వేటు ... రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

కర్నూలు జిల్లాలో కరోనా పంజా విసురుతుంది. అక్కడ అధికార యంత్రాంగం లాక్ డౌన్ నిబంధనలను కఠినతరం చేసినా సరే కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గటం లేదు . రోజుకు 70 కేసుల పైనే కొత్తగా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ రోజు కూడా జిల్లాలో 43 కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజు కరోనా నియంత్రణా చర్యలపై సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం జగన్ ఇప్పటి వరకు ఎన్ని సార్లు అధికారులను అప్రమత్తం చేసినా పరిస్థితిలో మార్పు లేదు . ఇక తాజాగా జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 386కు చేరుకుంది. ఇక ఈ నేపధ్యంలోనే సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403కు చేరుకుంది. ఇక కర్నూల్‌లో లో ముఖ్యంగా కేసులు పెరుగుతుండటంతో పాటు అక్కడ పలు ఘటనలు చోటు చేసుకుంటున్న నేపధ్యంలో సీఎం జగన్ కర్నూలు మీద దృష్టి సారించారు. ఇక తాజా పరిస్థితులను సీరియస్ గా తీసుకున్న జగన్ సర్కార్ఈ క్రమంలో అలసత్వం వహిస్తున్న అధికారులు, ఉన్నతాధికారులు, కమిషనర్లపై చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా కర్నూలు కమీషనర్ పై బదిలీ వేటు వేశారు.

Transfer on Kurnool Commissioner Ravindra Babu ... This is the Reason

కర్నూలు కమీషనర్ రవీంద్ర బాబుపై బదిలీ వేటు వేసిన ఏపీ సర్కార్ ఆయన స్థానంలో కొత్త కమీషనర్‌గా ఐఏఎస్ అధికారి డా. బాలాజీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన చేసి ఈ విషయం తెలియజేసింది . ఉన్నతాధికారులు కరోనా కంట్రోల్ చెయ్యటానికి అనుసరిస్తున్న ప్లాన్స్ సరిగా లేనందునే కేసులు పెరుగుతున్నాయని భావించిన సీఎం జగన్ ఈ తరహా నిర్ణయాలు తీసుకోవటం కొత్తేమీ కాదు . ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసి మరీ సీఎం జగన్ కరోనా కంట్రోల్ చెయ్యటంలో సమర్ధులను నియమించి ప్రయత్నాలు సాగిస్తున్నారు .

English summary
In Kurnool district, there have been 43 cases. The total number of cases in the district reached 386. Currently, the number of corona positive cases in AP has reached 1403. As the number of cases in Kurnool is rising, Jagan Sarkar has taken the matter seriously. Action is being taken against the sloppy officials, superiors and commissioners.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X