కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూమా కుటుంబానికి ఏవీ సుబ్బారెడ్డి చెక్: నంద్యాల సీటు ఎవ‌రికి : టిడిపి లో కొత్త పంచాయితీ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Kurnool District TDP Political Structure | Oneindia Telugu

క‌ర్నూలు టిడిపి లో మ‌రో పంచాయితీ మొద‌లైంది. జిల్లా టిడిపిలో వ‌ర్గ పోరు తారా స్థాయికి చేరింది. కోట్ల టిడిపిలోకి ఎంట్రీ పై కెఇ వ‌ర్గం అసంతృప్తితో ఉంది. ఇదే స‌మ‌యంలో మొన్న‌టి దాకా మంత్రి అఖిల వ‌ర్సెస్ ఏవి సుబ్బారెడ్డి గా జ‌రిగిన ఆ ళ్ల‌గ‌డ్డ పోరు ఇప్పుడు నంద్యాల‌కు మారింది. నంద్యాల సీటు పై పంచాయితీ మొదలైంది.

నంద్యాల లో టిక్కెట్ పంచాయితీ..

నంద్యాల లో టిక్కెట్ పంచాయితీ..

క‌ర్నూలు జిల్లా నంద్యాల టిడిపిలో కొత్త పంచాయితీ మొద‌లైంది. ఉప ఎన్నిక ద్వారా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన నం ద్యాల లో ఇప్పుడు టిడిపి టిక్కెట్ ఎవ‌రికి ద‌క్కుతంద‌నే దాని పై ఎవ‌రి అంచ‌నాల్లో వారు ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైసిపి నుండి గెలిచిన భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరారు. ఆ త‌రువాత ఆక‌స్మికంగా మృతి చెందారు. దీంతో..జ‌ర‌గిన ఉప ఎన్నిక‌లో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి టిడిపి నుండి పోటీ చేసి గెలిచారు. అయితే అక్క‌డ గెలుపు కోసం టిడిపి అన్ని శ‌క్తులు ఒడ్డింది. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు కోసం ఇప్ప‌టికే వ‌ర్గ పోరు మొద‌లైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బ్ర‌హ్మానంద రెడ్డి తిరిగి త‌న‌కే సీటు ఇస్తార‌నే ఆశ‌తో ఉన్నారు. అయితే, ఆళ్ల‌గ‌డ్డ లేదా నంద్యాల లో ఒక‌టి మాత్ర‌మే భూమా కుటుంబానికి దక్కుతుంద‌ని..రెండు సీట్లు సాధ్యం కాద‌నే ప్ర‌చారం టిడిపిలో సాగుతోంది.

రేసులో ఏవి సుబ్బారెడ్డి..

రేసులో ఏవి సుబ్బారెడ్డి..

ఇదే స‌మ‌యంలో నంద్యాల టిక్కెట్ తాను ఆశిస్తున్నానంటూ ఏవి సుబ్బారెడ్డి చెప్ప‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కర్నూలు రాజకీయాల్లో భూమా, ఏవీ కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మంచి మిత్రులు. భూమా మరణం తర్వాత ఈ రెండు కుటుంబాల మధ్య అంతరం ఏర్పడింది. మంత్రి అఖిలప్రియ, సుబ్బారెడ్డిలు ఆరోపణ, ప్రత్యారోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. అఖిల ప్రియకు, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇటువంటి ప‌రిస్థితుల్లో నంద్యాల లో ఈ సారి మైనార్టీల‌కు అవకాశం ఇస్తార‌ని చెబుతున్నారు. శాస‌న‌మండ‌లి ప్ర‌స్తుత ఛైర్మ‌న్ ఫ‌రూక్ కు ఈ సీటు ఇస్తార నే వాద‌న ఉంది. ఈ ప‌రిస్థితుల్లో ఏపి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు కల‌క‌లం రేపుతున్నాయి. మ‌రోవైపు చంద్ర‌బాబు క‌ర్నూలు లో ఎవ‌రికి సీటు ఇవ్వాల‌నే దాని పై ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు ప్రారంభించారు.

అసంతృప్తిలో కెఇ వర్టం..

అసంతృప్తిలో కెఇ వర్టం..

క‌ర్నూలు జిల్లా టిడిపికి పెద్ద దిక్కుగా ఉన్న కెఇ కృష్ణ‌మూర్తి ఆయ‌న మ‌ద్ద‌తు దారులు అసంతృప్తితో ఉన్న‌ట్లు జిల్లాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. జిల్లాలో తాము ఎవ‌రిమీద పోరాటం చేసామో వారిని పార్టీలోకి ఆహ్వానించ‌టం ..ఆ విష‌యం పై త‌మ‌కు క‌నీసం స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌టం పై కెఇ కృష్ణ‌మూర్తి కినుక వ‌హించారు. ముఖ్య‌మంత్రి త‌న‌తో చెప్పినప్పుడే తాను స్పందిస్తాన‌ని..త‌నంత‌ట‌గా తాను దీని పై మాట్లాడ‌న‌ని కెఇ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసారు, మ‌రోవైపు కోట్ల సూర్యప్ర‌కా శ్ రెడ్డి టిడిపిలో చేరితే కొన్ని రెండు నియోజ‌క‌వ‌ర్గాల వ‌ర‌కు వారికి కేటాయించాల్సి ఉంటుంది. దీంతో..ఇప్ప‌టికే ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ని చేస్తున్న టిడిపి నేత‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ క‌ర్నూలు జిల్లాలో త‌లెత్తుతున్న రాజ‌కీయ స‌మ‌స్య‌ల పై టిడిపి జిల్లా నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

English summary
Kurnool TDP Poliltics changing day by day. Party leader AV Subbareddy became aspirant for Nandyal tdp seat. Kotla entry into TDP also creating problem for K.E Camp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X