• search
  • Live TV
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇద్దరు యువతుల ప్రేమాయణం.. ఆపై ఇంట్లోనుండి జంప్ ... ఏపీలో అవాక్కయ్యే ప్రేమకథ

|

అవును వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోయారు.. ఇంకేంటి ఇంట్లో తల్లిదండ్రులకు ఎవరికీ తెలియకుండా ఇల్లు వదిలి పరారయ్యారు.. ఈ విషయం తెలిసిన ఊళ్లో వాళ్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రేమికుల జంట పారిపోవడం కామనే కదా.. అవాక్కయ్యేంత సినిమా ఏముంది అనుకుంటున్నారా ? ఇక్కడ పెద్ద సినిమానే ఉంది. అందుకే వారి ప్రేమాయణం విన్నవాళ్ళు హవ్వ అని నోరు నొక్కుకుంటున్నారు .

 కర్నూలు జిలాలో ఇద్దరు అమ్మాయిల ప్రేమ .. పారిపోయిన యువతుల జంట

కర్నూలు జిలాలో ఇద్దరు అమ్మాయిల ప్రేమ .. పారిపోయిన యువతుల జంట

ఇక అసలు ఈ ప్రేమకథలోకి వస్తే ..

కర్నూలు జిల్లాలో ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుని పారిపోవడం సంచలనంగా మారింది. సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయి, నరసింహారెడ్డి నగర్ కు చెందిన మరో అమ్మాయి చిన్ననాటి నుండి మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారడంతో ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేకపోయారు. ఇద్దరూ కలిసి ఇల్లు వదిలి పారిపోదామని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇద్దరమ్మాయిలు ఇల్లు వదిలి పరారయ్యారు.

 తల్లిదండ్రులకు సంక్షిప్త సమాచారం .. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

తల్లిదండ్రులకు సంక్షిప్త సమాచారం .. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

వెళుతూ వెళుతూ తల్లిదండ్రులకు సంక్షిప్త సమాచారం పంపి వెళ్లిపోయారు.

ఇక ఇద్దరు అమ్మాయిల ప్రేమాయణం గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఏం చేయాలో అర్థం కాక ఇరువురి అమ్మాయిల తల్లిదండ్రులు కర్నూలు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి తమ పిల్లలను వెతకాలంటూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతుల ఆచూకీ గురించి ఆరా తీస్తున్నారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం బయటకు పొక్కడంతో ఇద్దరు యువతులు ప్రేమించుకుని, పారిపోవడం పై జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

రోజురోజుకూ పెరుగుతున్న ఘటనలు .. ఆందోళనకరంగా సమాజ పోకడలు

రోజురోజుకూ పెరుగుతున్న ఘటనలు .. ఆందోళనకరంగా సమాజ పోకడలు

ఇటీవల ఇటువంటి ఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం పంజాబ్ లోని జలంధర్ లో ఇద్దరమ్మాయిలు ప్రేమించడమే కాదు పోర్టు సాక్షిగా జీవిత భాగ స్వాములు కూడా అయిన ఉదంతం వెలుగు చూసింది. బెతియా గ్రామంలో ఇస్రత్ , నగ్మా అనే ఇద్దరమ్మాయిలు పక్కపక్క ఇళ్లలో నివసించే వారు వారిరువురు ఒకరంటే ఒకరు ఇష్టంగా ఉండేవారు. ఒకరిని వదిలి పెట్టి ఒకరు ఉండలేని పరిస్థితుల నేపథ్యంలో, అదే విషయాన్ని వారు వారి తల్లిదండ్రులకు చెప్పారు . కానీ పెద్దలు ససేమిరా అనడంతో చేసేదేమీ లేక ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయి కోర్టులో పెళ్లి చేసుకున్నారు. ముందు పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారిద్దరూ కలిసి జీవించాలని గట్టిగా నిర్ణయించుకోవడంతో వారిరువురికి పెళ్లి చేశారు. ఇక ఇటువంటి ఘటనలతో ముందు ముందు సమాజంలో ఎలాంటి పోకడలకు కారణం అవుతాయో అన్న ఆందోళన కలుగుతుంది.

English summary
The escape of two girls in love in Kurnool district has become a sensation. A girl from Santosh Nagar area and another girl from Narasimhareddy Nagar have been good friends since childhood. The friendship between the two turned into love and they could not leave each other. The two decided to leave the house together and flee. The couple left the house late as expected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X