కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యూ టర్న్ బాబు : లెక్కలడిగితే అడ్డం తిరిగాడు, కర్నూలు సభలో మోదీ విసుర్లు

|
Google Oneindia TeluguNews

కర్నూలు : ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు సంబంధించిన లెక్కలు అడిగితే అడ్డం తిరిగారని ఆరోపించారు. యూ టర్న్ తీసుకొని తనను టార్గెట్ చేశారని మండిపడ్డారు. సాధారణంగా పథకాలలో కుంభకోణాలు జరుగుతాయని, కానీ ఏపీలో అందుకు విరుద్ధ పరిస్థితి ఉందని పేర్కొన్నారు. తొలుత స్కాం అంచనావేసి .. తర్వాత పథకాలను రూపొందిస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు బహిరంగసభలో మోదీ ప్రసంగించారు.

అవినీతిపరులతో జట్టు

అవినీతిపరులతో జట్టు

ఏపీకి ఇచ్చిన నిధులు అడగటమే పాపమైందా అని ప్రజలనుద్దేశించి అడిగారు. దీంతో రాష్ట్రాభావృద్ధిని పక్కనపెట్టి .. అవినీతి నేతలతో జట్టుకట్టారని ఆరోపించారు. దేశంలో ఉన్న మిగతా నేతలను కలుపుకొని తనను ఓడించేందుకు జట్టుకట్టారని, ఇదీ తగునా అని ప్రశ్నించారు.

పథకాలకు స్టిక్కర్లు ..

పథకాలకు స్టిక్కర్లు ..

ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ఫోకస్ చేయలేదన్నారు మోదీ. డెవలప్ మెంట్ పట్టించుకోకుండా .. కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసుకొని, లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి కోసం మరోసారి అవకాశం ఇవ్వాలని. కేంద్రంలో, రాష్ట్రంలో తమకు అధికారం అప్పగిస్తే .. సంక్ఝేమం జోడుద్దుల్లాగా పయనిస్తోందని చెప్పారు.

నిధులిస్తున్నా .. ముందుకుసాగని పనులు

నిధులిస్తున్నా .. ముందుకుసాగని పనులు

ఏపీలో 3 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని పేర్కొన్నారు మోదీ. పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తున్నా పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయని చెప్పారు. రాయలసీమ అభివృద్ది కోసం నరసింహారెడ్డి పోరాడితే, ఆ ప్రాంత వాసులే ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు అల్లడటానికి చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు.

మై బీ చౌకీదార్ : మోదీ

మై బీ చౌకీదార్ : మోదీ

ఐదేళ్ల క్రితం అవకాశం ఇస్తే మీ సేవకుడిని అయ్యానని గుర్తుచేశారు మోదీ. అప్పటినుంచి మీ ఆశయసాధనం కోసం రేయింబవళ్లు పనిచేశానని తెలిపారు. ఏపీలో ఎన్ఐటీ, ఐఐటీ, ట్రైబల్ వర్సిటీ, కర్నూలులో మెగా సోలార్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది తానేనని గుర్తుచేశారు మోదీ. పెట్రోలియం వర్సిటీ, ఐఐఎఫ్సీటీ, అనంతపురంలో కేంద్రీయ వర్సిటీ కేటాయించినట్టు తెలిపారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చింది మీ చౌకీదార్ అని నొక్కి వక్కానించారు మోదీ.

అభివృద్ధికి చేయూత .. సహకరించని బాబు

అభివృద్ధికి చేయూత .. సహకరించని బాబు

ఏపీ అభివృద్ధి కోసం చేయూతనిస్తానని, కానీ అందుకు సీఎం చంద్రబాబు సహకరించడం లేదన్నారు మోదీ. ఏపీ కోసం నిధులు, పథకాలు ఇచ్చేందుకు సిధ్దంగా ఉన్నా .. ఆయన కో ఆపరేషన్ లేదని చెప్పారు. అంతేకాదు విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి ఎయిర్ పోర్టులను ఆధునీకరించింది ఎన్డీయే సర్కారేనని స్పష్టంచేశారు మోదీ.

English summary
Prime Minister Narendra Modi was furious over AP CM Chandrababu. Asked about the funds given by the central government, he alleged that he had gone. Commonly, schemes are scandalous, but the AP has a contradictory condition. First, the scam was evaluated and the plans were later shaped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X