వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

A Flying Jatt పూరన్: కాలు విరిగిన స్థితి నుంచి గాల్లోకి ఎగిరే దాకా

|
Google Oneindia TeluguNews

షార్జా: ఈ సీజన్ ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన నికొలస్ పూరన్.. ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయాడు. ఈ సీజన్‌లో తాను ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే రెండుసార్లు డకౌట్ అయ్యాడనే చెడ్డపేరును సంపాదించుకున్న ఆ కరేబియన్ బ్యాటింగ్ వీరుడు.. ఇప్పుడు క్రికెట్ ప్రేమికుల ఆరాధ్యుడు అయ్యాడు. ఫ్లయింగ్ జాట్ అనే ముద్దుపేరును సంపాదించుకున్నాడు. అతని ఫీల్డింగ్ ఎఫర్ట్.. ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగిందని ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.

51 off 18 balls: బౌలర్ల ఊచకోత: తెవాటియా టేక్ ఎ బౌ: 29 సిక్సర్లు: ఈ సీజన్‌లో

ఫీల్డింగ్‌లో ఓ బెంచ్ మార్క్..

ఫీల్డింగ్‌లో ఓ బెంచ్ మార్క్..

ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసిందని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇకముందు నికొలస్ పూరన్ పేరును తలచుకుంటే.. బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగురుతోన్న ఫొటో మాత్రమే అభిమానులకు కనిపించేలా చేసిందీ ఫీట్. ఇంతకుముందు.. ఇలాంటి ఫీల్డింగ్ చూడలేదని.. ఇక ముందూ చూస్తామనే ఆశ లేదనీ చెబుతున్నారు. ఇప్పటికే నికొలస్ పూరన్ ఫీల్డింగ్‌పై లెజెండరీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండుల్కర్.. కొనియాడారు. తన క్రికెట్ జీవితంలో చూసిన అత్యుత్తమ ఫీల్డింగ్ ఎఫర్ట్ ఇదేనని చెప్పారు. తాను ఇప్పటికీ ఆ ఫీట్‌ను నమ్మలేకపోతున్నానని అన్నారు. పూరన్ ఫీల్డింగ్ అద్భుతమని ట్వీట్ చేశారు.

కాలు విరిగిన స్థితి నుంచి..

కాలు విరిగిన స్థితి నుంచి..

నిజానికి- నికొలస్ పూరన్ 2015లో ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని కాలు విరిగిపోయింది. ట్రినిడాడ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అతని ఎడమకాలికి ఫ్రాక్చర్ అయింది. సిమెంట్ కట్టుతో కొన్ని నెలల తరబడి అతను కాలు కింద పెట్టలేని పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతని క్రికెట్ కేరీర్‌కు పుల్ స్టాప్ పడినట్టేనని భావిస్తోన్న తరుణంలో.. ఫీనిక్స్ పక్షిలా దూసుకొచ్చాడు. ఇప్పుడిలా గాల్లోకి ఎగిరే స్థితికి చేరుకున్నాడు. క్రికెట్ పట్ల ఉన్న ప్రేమ అతణ్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది.

స్టార్ ఫీల్డర్‌ నుంచి ప్రశంసల వర్షం..

స్టార్ ఫీల్డర్‌ నుంచి ప్రశంసల వర్షం..

ఇలాంటి గొప్ప ఫీల్డింగ్‌ను తాను ఇప్పటిదాకా చూడలేదని చెప్పారు. ఎన్నిసార్లు చూసినా చూడాల్సిన ఫీట్‌గా చెప్పుకొచ్చారు. పూరన్ అద్భుత ఫీల్డింగ్‌తో సిక్స్ బదులుగా రెండు రన్లు మాత్రమే వచ్చాయి. స్టార్ ఫీల్డర్‌గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఏకైక క్రికెటర్ జాంటీ రోడ్స్. ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఇంజమామ్ ఉల్ హక్‌ను జాంటీ రోడ్స్ రనౌట్ చేసిన విధానాన్ని ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేరు.

 డగౌట్‌లో లేచి నిల్చుని.. అభినందన

డగౌట్‌లో లేచి నిల్చుని.. అభినందన

జాంటీ రోడ్స్ అంటే.. పక్షిలా ఎగురుతున్న ఫొటో అభిమానుల మెదడులో ప్రింట్ అయిపోయిందంతే. అలాంటి జాంటీ రోడ్స్ కూడా.. నికొలస్ పూరన్ ఫీల్డింగ్ ఎఫర్ట్‌కు స్టన్ అయిపోయాడు. ప్రస్తుతం అతను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. పూరన్ ఫీల్డింగ్ చూసిన వెంటనే.. డగౌట్‌లో జాంటీ రోడ్స్ లేచి నిలబడి మరీ చప్పట్లు కొడుతూ పూరన్‌ను అభినందించాడు. పంజాబ్ కోచ్‌గా గర్వపడుతున్నానంటూ జాంటీ రోడ్స్ అతనిపై ప్రశంసలు కురిపించాడు.

Recommended Video

IPL 2020 : Netizens Troll Nicholas Pooran After His Double Duck Vs Delhi Capitals
మిల్లీ సెకెండ్.. అంతే

మిల్లీ సెకెండ్.. అంతే

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో భాగంగా ఆదివారం రాత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పంజాబ్ బౌలర్ మురుగన్ అశ్విన్ వేసిన ఓ బాల్‌ను సంజు శాంసన్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. నిజానికి అది సిక్సరే. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న నికొలస్ పూరన్.. పక్షిలా గాల్లోకి ఎగిరి.. బౌండరీ లైన్‌కు అవతలికి వెళ్లిపోయాడు. బంతిని క్యాచ్ చేశాడు. మిల్లీ సెకెండ్ వ్యవధిలో దాన్ని బౌండరీకి ఇవతల విసిరేశాడు. దానితో ఆరు పరుగులు రావాల్సిన చోటు రెండే వచ్చాయి.

English summary
Kings XI Punjab's (KXIP) fielding coach Jonty Rhodes on Monday hailed Nicholas Pooran's fielding effort at the boundary rope to save a six with his acrobatic skills. In the eighth over, Rajasthan Royals' Sanju Samson had played a pull shot off Ashwin and it was then that Pooran, at deep mid-wicket, dived full length over the rope to catch the ball.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X