మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణా కొత్త సీఎస్ కు చేదు అనుభవం ..చుక్కలు చూపించిన పాలమూరు జనం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కొత్త చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్‌ ఇలా బాధ్యతలు చేపట్టారో లేదో అప్పుడే ఆయన చేదు అనుభవాన్ని చవి చూఒశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిన ఆయనకు పాలమూరు జనం గురువారం చుక్కలు చూపించారు. తమ సమస్య ఎవరూ పట్టించుకోవటం లేదని వారు సీఎస్ ను అడ్డుకున్నారు. తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంతకీ వారు సీఎస్ ను అడ్డుకున్న కారణం ఏమిటి అంటే

పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించాలని సీఎస్ ను అడ్డుకున్న పాలమూరు వాసులు

పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించాలని సీఎస్ ను అడ్డుకున్న పాలమూరు వాసులు

మహబూబ్ నగర్ జిల్లాలో కాలుష్య కాసారాలుగా పారిశ్రామిక వాడలు ఉన్నాయని జిల్లా పర్యటనకు వెళ్ళిన సోమేశ్ కుమార్‌ను అడ్డుకున్నారు స్థానిక ప్రజలు. రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామస్తులు తెలంగాణా కొత్త సీఎస్ సోమేశ్ కుమార్ ను అడ్డుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు . కాలుష్య కారక పరిశ్రమలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని వారు చెప్పారు.

 రెండవ దశ పల్లె ప్రగతిలో పాల్గొనేందుకు వెళ్ళిన సీఎస్

రెండవ దశ పల్లె ప్రగతిలో పాల్గొనేందుకు వెళ్ళిన సీఎస్


రెండో దశ పల్లె ప్రగతి కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభం అయింది. పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులపై దృష్టిసారించనున్నారు. నేటి నుంచి 11 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.పల్లె ప్రగతి కార్యక్రమం తొలి రోజు కార్యక్రమాలలో పాల్గొనేందుకుగాను మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు వెళ్ళారు. కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవడం లేదంటూ సీఎస్ పర్యటనలో ఆందోళన వ్యక్తం చేశారు గ్రామస్తులు.

పారిశ్రామిక కాలుష్యంపై క్షేత్ర స్థాయి పరిశీలన .. చర్యలకు ఆదేశం

పారిశ్రామిక కాలుష్యంపై క్షేత్ర స్థాయి పరిశీలన .. చర్యలకు ఆదేశం

గ్రామస్తుల డిమాండ్ మేరకు రంగారెడ్డి గూడ గ్రామంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు.పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో తమ గ్రామంలో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నామని, చాలా మంది రోగాల బారిన పడుతున్నారని గ్రామస్తులు సీఎస్ సోమేశ్ కుమార్ ద‌ృష్టికి తీసుకువెళ్ళారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించిన సోమేశ్ కుమార్ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

English summary
The Palamuru local people have blocked Somesh Kumar, who was on a tour of the Mahabubnagar district, claiming that there are industrial uses for pollution in Mahabubnagar district. The villagers of Rajapur Mandal Rangareddy guda blocked Telangana's new CS Somesh Kumar. They are angry that the government is not taking action on polluting industries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X