కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ కస్సు బుస్సు.. రాహుల్‌ను ఈడీ విచారిస్తోన్న పట్టించుకునే నాథుడే లేడు
ప్రధాన పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌పై టీఆర్ఎస్.. గులాబీ దళంపై హస్తం, బీజేపీ నేతల విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అంటున్నాడని, ఒక్క అవకాశం ఇస్తే తెలంగాణ రైతుల రూపురేఖలు మార్చేస్తా అంటున్నాడని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి ఇదివరకు ఛాన్స్ ఇవ్వలేదా? కాంగ్రెస్ పార్టీకి ఒకటి కాదు, తెలంగాణ ప్రజలు పది ఛాన్స్ ఇచ్చారని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కొల్హాపూర్‌లో జరిగిన సభలో కేటీఆర్ కామెంట్స్ చేశారు.

50 ఏళ్లు పాలించింది ఎవరు..?
దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏళ్ల పాటు పాలించింది వారే కదా అని పేర్కొన్నారు. రాహుల్ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ నుంచి ఆయన కుమార్తె ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ, ఆ తర్వాత సోనియా గాంధీ, ఇవాళ రాహుల్ గాంధీ... ఇలా ఐదు తరాల పాటు కాంగ్రెస్ పార్టీకి బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణ అధికారాన్ని అప్పగించింది. కానీ రాహుల్ గాంధీ మళ్లా వచ్చి ఒక్క చాన్స్ అంటున్నాడు. 50 ఏళ్లు అధికారం ఇస్తే కరెంటు ఇవ్వక చావగొట్టింది నువ్వు కాదా? మంచినీళ్లు ఇవ్వకుండా చావగొట్టింది నువ్వు కాదా? సాగునీరు ఇవ్వకుండా చావగొట్టింది నువ్వు కదా? పెన్షన్లు ఇవ్వక సతాయించింది నువ్వు కాదా? సరైన విద్యనందించక సతాయించింది నువ్వు కాదా? సోమశిల మీద బ్రిడ్జి కట్టక సతాయించింది నువ్వు కాదా? అని అడిగారు

నాశనం చేసి..
రాష్ట్రాన్నిసర్వనాశనం
చేసింది
ఎవరని
అడిగారు.
ఇవాళ
మళ్లీ
వచ్చి
ఒక్క
చాన్స్
ఇవ్వాలని
అడుగుతుంటే,
తల్లిదండ్రులను
చంపినవాడే
వచ్చి
నేను
అనాథనయ్యా
వదిలిపెట్టండి
అని
చెప్పినట్టుగా
ఉంది.
కాంగ్రెస్
పార్టీ
నేతలు
ఇవాళ
ఎన్ని
మాటలు
చెప్పినా
ఒక్క
మాట
మాత్రం
నిజం..
కాంగ్రెస్
పార్టీ
ఇవాళ
కాలం
చెల్లిన
మందు
లాంటిది.
భూమి
పుట్టినప్పుడు
పుట్టింది
కాంగ్రెస్
పార్టీ.
చరిత్ర
తప్ప
ఎక్కడా
వాళ్లకు
భవిష్యత్తు
లేదన్నారు.
ఏ
ఎన్నికల్లో
కాంగ్రెస్
గెలిచే
పరిస్థితి
లేదన్నారు.

ఈడీ విచారిస్తోన్న అడిగే దిక్కులేదు
రాహుల్
గాంధీని
ఈడీ
విచారిస్తున్నా
అడిగేవారే
లేరు.
ఎక్కడా
చడీ
చప్పుడు
లేదు.
అలాంటి
దౌర్భాగ్యపు
స్థితిలో
ఉన్న
కాంగ్రెస్
పార్టీ,
చావడానికి
సిద్ధంగా
ఉన్న
పార్టీ
అని
కేటీఆర్
విరుచుకుపడ్డారు.
గత
అనుభవాలు
లేవా?
ప్రజలు
దీనిపై
ఒక్కసారి
ఆలోచించాలి
అరి
కేటీఆర్
ప్రసంగించారు.