మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహబూబాబాద్‌లో వింత వ్యాధి: 130 మందికి తీవ్ర అస్వస్థత..

|
Google Oneindia TeluguNews

అసలే కరోనా వైరస్.. కొత్త రకం స్ట్రెయిన్‌తో ఆందోళన నెలకొంది. చలి తీవ్రత పెరగడంతో సీజనల్ వ్యాధుల టెన్షన్ కూడా ఉంది. ఇంతలా ఉత్కంఠ నెలకొంటే మహబూబా బాద్‌లో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. వ్యాధి గురించి తెలియరాలేదు. కానీ వందకు పైగా మంది మాత్రం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గ్రామంలోకి వైద్య సిబ్బంది చేరుకొని.. వారిని పరీక్షిస్తున్నారు.

అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. అయోధ్య శివారు భజన తండాలో వింత వ్యాధి జడలువిప్పి నాట్యం చేస్తోంది. వింత వ్యాధితో గత వారం రోజుల నుంచి గ్రామస్తులు బాధపడుతున్నారు. వాంతులు, విరేచనాలతో దాదాపు 130 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరికి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా ఇంతమంది అస్వస్థతకు గురవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

elusive disease in mahabubabad bhajanatanda

జిల్లా వైద్యాధికారులు గ్రామంలో వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ప్రజలకు దగ్గరుండి మరీ వైద్యం అందిస్తున్నారు. వ్యాధికి గల కారణాలు తెలియరాలేదు. తండాలో గల నీరు, ఆహారం శాంపిల్స్‌ను వైద్యాధికారులు ల్యాబ్‌కు పంపించారు. రిపోర్ట్ తర్వాత ఏం జరిగిందో తెలియనుంది. అనారోగ్యంతో ఉన్న బాధితులను ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తామని ఆయన తెలిపారు.

English summary
elusive disease in mahabubabad bhajanatanda. 130 people are illness
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X