మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

t pcc race: నేను లేను.. వ్యవసాయ చట్టాలపై కూడా చిన్నారెడ్డి పెదవి విరుపు

|
Google Oneindia TeluguNews

టీ పీసీసీ చీఫ్ ఎంపిక హైకమాండ్‌కు కూడా కత్తిమీద సాములా మారింది. కొత్త అధినేత ఎవరో సీల్డ్ కవర్ ప్రిపేర్ అయినా.. వెల్లడించడం లేదు. ఇటు నేతలు కూడా తమ శక్తి మేరకు లాబీయింగ్ చేస్తున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే మిగతా నేతలు కూడా హస్తినలో లాబీయింగ్ చేస్తున్నారు. టీ పీసీసీ చీఫ్ పదవీపై పరోక్షంగా ఇండికేషన్ ఇచ్చారు మాజీమంత్రి చిన్నారెడ్డి.

పీసీసీ రేసులో లేనని చిన్నారెడ్డి స్పష్టంచేశారు. పీసీసీ చీఫ్ పదవీ చేపట్టాలని తనకు లేదని చెప్పారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని హైకమాండ్‌కు తెలియజేశానని చెప్పారు. యువతను ప్రోత్సాహిస్తే బాగుంటుందని సూచించానని వివరించారు. చిన్నారెడ్డి సజెషన్ మేరకు రేవంత్/ కోమటిరెడ్డిలో ఎవరో ఒకరు పీసీసీ చీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం మంచి నిర్ణయమే తీసుకుంటుందని అభిప్రాయ పడ్డారు.

iam not t pcc chief race, chinna reddy

మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల గురించి కూడా చిన్నారెడ్డి మాట్లాడారు. పారిశ్రామిక వేత్తలు అంబానీ, ఆదానీలకు మాత్రమే ఉపయోగకరమని తెలిపారు. నియంత్రిత సాగుపై సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి వచ్చాక కేంద్ర వ్యవసాయ బిల్లులపై నోరు మెదపక పోవడం దారుణమని మండిపడ్డారు.

నియంత్రిత సాగు పేరుతో రైతుబందు రాదు అని రైతులను నిర్బందించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. నియంత్రిత సాగు విధానంలో రైతులు ఎద్దఎత్తున నష్టపోయారు అని చిన్నారెడ్డి చెప్పారు.

English summary
iam not t pcc chief race senior congress leader chinna reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X