హతవిధి.. బైక్పై వెళ్తుండగా గుండెపోటు.. కుప్పకూలి..
అప్పుడప్పుడు చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఆపద కూడ వస్తుంటాయి. మనం ఏదైనా అవసరం అయిన సమయంలో బండి మీద వెళ్లిన అంతే సంగతులు..అందరికీ కాదు కొందరికీ తిప్పలు తప్పడం లేదు. అవును ఓ యువకుడు బండిపై వెళుతుండగా గుండెపోటు వచ్చింది. దీంతో అతని వర్ణణాతీతం. అలాంటి ఘటన ఒకటి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగింది.
ఓ వ్యక్తి స్కూటీపై వెళుతుండగా హాఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో అతను నడిరోడ్డుపై కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీడియోలు సోషల్ మీడియా ద్వారా చూసిన ప్రతొక్కరూ దిగ్బ్రాంతికి లోనయ్యారు. జడ్చర్ల పాతబజార్లో రాజు అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను ప్రైవేటు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

నిన్న సాయంత్రం తనకు గుండెల్లో నొప్పిగా ఉందని..మిత్రులకు చెప్పాడు. వెంటనే ఓ మిత్రుడు స్కూటీ తీసుకుని రాజు ఇంటికి వచ్చి..అతడిని ఆసుపత్రికి తీసుకెళుతున్నాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత..రాజుకు గుండెపోటు రావడంతో...స్కూటీ నుంచి రోడ్డుపై కిందపడిపోయాడు. ఘటనాస్థలంలోనే చనిపోయాడు. వెంటనే అతని మిత్రుడు రాజును రోడ్డు పక్కకు తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గుండెలో నొప్పి ఉందగగానే.. అతని స్నేహితుడు వచ్చిన ఫలితం లేకపోయింది.
రాజు చనిపోయాడని తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమను ఒంటరివాడిని తెలిసీ.. వెళ్లిపోయావా అంటూ నిట్టూర్చారు. తిరిగిరానీ లోకాలకు వెళ్లిన రాజు.. కుటుంబానికి తీరని కడుపుశోకాన్ని మిగిల్చాడు. అనారోగ్యానికి గురయిన సమయంలో అలర్ట్గా ఉండాలి.. వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. కానీ బైక్ మీద కాకుండా.. అంబులెన్సులో వెళితే మరీ మంచిది. లేదంటే రాజు మాదిరిగా దక్కకపోవచ్చు. ఆపద రావచ్చు.. కానీ దాని నుంచి సేవ్ కావాలి.. అవును ప్రాణాలతో బయటపడితేనే మంచిది. అలా అందరికీ జరగాలంటే వైద్యుల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. సొంతంగా కాకుండా.. అంబులెన్స్ తీసుకుంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. దీనికి తోడు మరికొందరు సొంతంగా మందులు వాడతారు. ఇదీ కూడా మంచి పద్దతి కాదు. వైద్యుని సమక్షంలో.. అతను ఇచ్చే మందులనే తీసుకోవాల్సి ఉంటుంది.