ప్లీజ్.. 6 నెలలు దూరంగా ఉండండి, మంత్రి కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. కొలువుల కోసం యువత ఆశగా ఎదురుచూస్తోంది. టీఎస్ పీఎస్సీ ద్వారా కొన్ని జాబ్స్ ఫిలప్ చేశారు. కానీ యువత ఆశించిన స్థాయిలో మాత్రం రాలేదు. దీంతో ఉద్యోగాల కోసం విపక్షాలు సహా విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో కొత్త పోస్టుల భర్తీపై సీఎం కేసీఆర్ నిండు అసెంబ్లీలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వివిధ ఉద్యోగాలకు ఆప్లై చేసుకునే వారు.. మొబైల్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. ఇదివరకు మంత్రి హరీశ్ రావు పిలుపు నివ్వగా.. ఇప్పుడు మంత్రి కేటీఆర్ వంతు వచ్చింది.

ప్లీజ్.. దూరంగా ఉండండి
మహబూబ్ నగర్ ఎక్స్పో ప్లాజాలో శాంతా నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఉద్యోగాలకు పోటీ పడుతోన్న అభ్యర్థులకు కేటీఆర్ పలు పుస్తకాలను అందజేశారు. నిరుద్యోగ యువత వచ్చే ఆరు నెలలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వినతి మేరకు మహబూబ్ నగర్ పట్టణానికి అవసరమైన నిధులను మునిసిపల్ శాఖ ద్వారా మంజూరు చేస్తామని తెలిపారు.

వయో పరిమితి..
ఇటు కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయో పరిమితి ఐదేళ్లు పెంచాలని డిమాండ్ వస్తోంది. నిరుద్యోగి ఈ అంశాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. కరోనాతో రెండేళ్లు వేస్ట్ అయ్యిందని చెప్పారు. నోటిఫికేషన్లో ఇచ్చిన మూడేళ్ల సడలింపు సరిపోదని చెప్పాడు. మరో రెండేళ్లు పెంచాలని కోరాడు. ఈ అంశాన్ని పరిశీలించాలని హోంమంత్రి మహమూద్ అలీని కోరతామని కేటీఆర్ చెప్పారు. 17 వేల పోలీసు కొలువుల్లో 587 ఎస్ఐ, 414 సివిల్ ఎస్ఐ, 16,027 కానిస్టేబుల్, 66 ఏఆర్ ఎస్ఐ, 5 రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. విపత్తు, అగ్నిమాపక శాఖలోనూ 26 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, 8 డిప్యూటీ జైలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్నిమాపక, జైళ్ల శాఖ, ఐటీ విభాగంలోనూ పలు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.

రూ.8 వేలా..?
పోలీసు
నియామకాలకు
సంబంధించి
ఒక్కో
పోస్టుకు
రూ.800
నుంచి
రూ.
1000
వరకు
దరఖాస్తు
చేయడానికి
ఖర్చు
అవుతుంది.
దీనిపై
కూడా
నిరుద్యోగుల్లో
కొంత
అసహనం
కనిపిస్తోంది.
వారు
చిన్న
చితక
పని
చేసి
గడుపుతుంటారు.
ఇంతమొత్తంలో
కట్టాలని
కోరితే
ఎలా
అని
అడుగుతున్నారు.
అన్నీ
పోస్టులకు
ఆప్లై
చేయాలంటే
కనీసం
రూ.7
వేల
నుంచి
రూ.8
వేల
వరకు
ఖర్చవనుంది.
దీనిపై
ఉద్యోగార్థుల
నుంచి
వ్యతిరేకత
వస్తోంది.
కానీ
ఇప్పటికే
దరఖాస్తుల
ప్రక్రియ
మొదలైనందున..
ఇందులో
మార్పేమి
ఉండకపోవచ్చు.
కానీ
అభ్యర్థులు
మాత్రం
పెదవి
విరుస్తున్నారు.
ఇంత
మొత్తంలో
నగదు
పెట్టి
ఉండాల్సింది
కాదని
అభిప్రాయ
పడుతున్నారు.
దీని
వల్ల
తమకే
నష్టం
జరుగుతుందని
చెబుతున్నారు.